శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 25 ఆగస్టు 2019 (18:08 IST)

మూర్ఖుల స్వర్గంలో నరేంద్ర మోడీ సర్కారు: పాక్ అధ్యక్షుడు

మూర్ఖుల స్వర్గంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు ఉందని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ స్పష్టం చేశారు. ఆయన ఆదివారం విదేశీ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌పై పలు ఆరోపణలు చేశారు. ముఖ్యంగా, కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై విమర్శలు గుప్పించారు. 
 
కాశ్మీర్ విషయంలో రాజ్యాంగంలో మార్పులు చేసిన పర్యవసానంగా తీవ్రవాదం పెరిగితే అందుకు పాకిస్థాన్ బాధ్యత వహించబోదని స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కాశ్మీర్ అంశంపై చేసిన తీర్మానాలను భారత్ తుంగలో తొక్కిందని ఆరోపించారు. 
 
ముఖ్యంగా, పుల్వామా వంటి ఘటనలను భారత్ సాకుగా చూపి పాకిస్థాన్‌పై భారత్ దాడులకు పాల్పడవచ్చేమో కానీ, తాము మాత్రం యుద్ధానికి వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. 
 
అయితే, భారత్ మాత్రం ఒకవేళ యుద్ధానికి దిగితే మాత్రం ప్రత్యర్థిని ఎదుర్కొనే హక్కు తమకుందన్నారు. భారత్‌లో అధికారంలో ఉన్న మోడీ సర్కారు మూర్ఖుల స్వర్గంలో ఉందని, కాశ్మీర్ విషయంలో నిప్పుతో చెలగాటమాడుతున్నారని అల్వీ విమర్శించారు.