శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2019 (16:25 IST)

కాశ్మీర్‌లో గుజ్జర్ యువకులను కాల్చిచంపిన మిలిటెంట్లు

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో గుజ్జర్ తెగకు చెందిన ఇద్దరు యువకులను మిలిటెంట్లు కాల్చి చంపారు. ఈ రాష్ట్రంలో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత తొలి హింసాత్మక సంఘటన ఇదే కావడం గమనార్హం. 
 
పోలీసుల కథనం మేరకు, సోమవారం రాత్రి 7.30 గంటలకు పుల్వామా జిల్లా థోక్ ప్రాంతంలోని తాత్కాలిక శిబిరం నుంచి అబ్దుల్ ఖదీర్ (రాజౌరీ జిల్లా వాసి), మన్సూర్ అహ్మద్ (శ్రీనగర్ వాసి) అనే ఇద్దరు గుజ్జర్లను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. దీంతో, ఆ మిలిటెంట్ల కోసం భద్రతాబగలాలు ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 
పుల్వామా జిల్లా అటవీ ప్రాంతంలో బుల్లెట్లతో ఛిద్రమైన వీరిద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకాశ్మీర్‌లో జరిగిన తొలి ఉగ్రవాద హింసాకాండ ఇదే. ఈ సందర్భంగా జమ్ముకాశ్మీర్ డీజీపీ దిల్ బాల్ సింగ్ మాట్లాడుతూ, గుజ్జర్ యువకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాద గ్రూపును మట్టుబెడతామని చెప్పారు.