పీవీ సింధుగా అక్కినేని కోడలు వర్సెస్ దీపికా పదుకొనె

samanta
Last Updated: మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (10:56 IST)
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. ఈమె జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు సోనూ సూద్ తెరకెక్కించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాడు.

ఈ చిత్రంలో ఆయన కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్రలో నటించనున్నారు. అయితే, పీవీ సింధు పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై కొద్ది రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పీవీ సింధుగా అక్కినేని కోడ‌లు స‌మంత‌ కనిపించనున్నారనే వార్తలు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

కానీ, పీవీ సింధు చేసిన ఓ ట్వీట్ ఇపుడు ఆసక్తికరంగా మారింది. తన పాత్రలో పాత్రలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనెను చూడాలనుకుంటున్నాను. ఆమె చురుకైన బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్‌తో పాటు మంచి న‌టి.

అందుకే నా పాత్ర‌లో దీపికాని చూడాల‌ని అనుకుంటున్నాను. ఇక తుది నిర్ణ‌యం మేక‌ర్స్‌దే అని సింధు పేర్కొంది. ప్ర‌స్తుతం దీపికా ప‌దుకొనె... క‌పిల్ దేవ్ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న '83' చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తోంది.దీనిపై మరింత చదవండి :