శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2019 (19:26 IST)

డబ్బులు ఊరకే రావు... మీ కష్టార్జితం వృథా చేయకండి.. కొత్త ట్రాఫిక్ చట్టం అపరాధం వివరాలు

డబ్బులు ఊరికే రావు... మీ కష్టార్జితం వృథా చేయకండి.. ఈ డైలాగ్ ఎక్కడో ఉన్నట్టుగా ఉంది. ముఖ్యంగా, ప్రముఖ నగల వస్త్రాల దుకాణం యజమాని నోటి వెంట ఈ మాటలు వింటుంటాం. అయితే, ఇపుడు ఇవే మాటలను ట్రాఫిక్ పోలీసులు కూడా పదే పదే చెబుతున్నారు. 
 
కొత్త మోటారు వాహన సవరణ చట్టం 2019 సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకిరానుంది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ రకాలకు చెందిన పోలీసులు... కొత్త మోటారు వాహనం చట్టంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 
 
"ఇందుకోసం వారు చేస్తున్న ప్రచారంలో "డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. మీ కష్టార్జితం వృథా చేయకండి" అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తూ మోటారు వాహన సవరణ చట్టం 2019పై అవగాహన కల్పిస్తున్నారు. 
 
కొత్త చట్టంలోని 63 ప్రొవిజన్లను కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫై చేసింది. ఈ కొత్త క్లాజులు సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తాయని రోడ్డు, రవాణా జాతీయ రహదారుల శాఖ వెల్లడించింది. వీటిలో భారీ జరిమానాలు, లైసెన్సు, రిజిస్ట్రేషన్‌, జాతీయ రవాణా విధానానికి సంబంధించిన నిబంధనలున్నాయి. 
 
ట్రాఫిక్‌ నియమాలు ఉల్లంఘిస్తే విధించే భారీ జరిమానాల పట్టిక ఒసారి చూడండి. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించండి.. మీ వాహనాలు జాగ్రత్తగా నడపండి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక మీ జేబు గుల్లవుతుంది. డబ్బులు వృథా చేసుకోకండి. డబ్బులు ఎరికీ ఊరికే రావు కదా.. అంటూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
 
కాగా, నిబంధనలు ఉల్లఘించే వాహనదారులకు విధించే అపరాధ రుసుం వివరాలను పరిశీలిస్తే, 
 
* హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే... కొత్త చట్టం మేరకు రూ.1000 (ప్రస్తుతం రూ.100) లేదా మూడు నెలల పాటు లైసెన్సు రద్దు. 
 
* మద్యంమత్తులో వాహనం నడిపితే రూ.10 వేలు (ప్రస్తుతం రూ.2 వేలు). 
 
* సీటుబెల్టు పెట్టుకోకపోతే రూ.వెయ్యి (ప్రస్తుతం రూ.100).
 
* డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడిపితే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.500)
 
* రాంగ్ రూట్‌లో వాహనం నడిపితే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.1100)
 
* అతివేగం రూ.1000 లేదా రూ.2 వేలు (ప్రస్తుతం రూ.400).
 
* ప్రమాదకరంగా వాహనం నడిపితే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.1000). 
 
* అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10 వేలు (ప్రస్తుతం ఎలాంటి అపరాధం లేదు)
 
* వాహనానికి బీమా లేకపోతే రూ.2 వేలు (ప్రస్తుతం రూ.1000)
 
* పర్మిట్ లేని వాహనానికి రూ.10 వేలు (ప్రస్తుతం రూ.5000)
 
* త్రిబుల్ డ్రైవింగ్ చేస్తే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.1200)
 
* సెల్‍‌ఫోన్ డ్రైవింగ్ చేస్తే రూ.5 వేలు (రూ.వెయ్యి)
 
 * మైనర్ డ్రైవింగ్ రూ.25 వేలు లేదా సంరక్షకులు లేదా యజమానికి మూడు సంవత్సరాల జైలుశిక్ష మరియు అపరాధం. ప్రస్తుతం రూ.1500 మాత్రమే వసూలు చేస్తున్నారు.