శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2019 (12:56 IST)

హీరోయిన్ కావాలనుకుని వస్తే.. చివరికి ఇలా జరిగిపోయింది..

హీరోయిన్ కావాలనుకుని ఆ యువతి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. అమ్మ వద్దని చెప్పినా.. ముంబైకి రైలెక్కేసింది. అవకాశాల కోసం ఎన్నో ఫిలిమ్ ఆఫీసుల చుట్టూ తిరిగింది. అయితే ఆమెకు చిన్నా చితకా క్యారెక్టర్లు తప్పించి, మెయిన్ క్యారెక్టర్లు కానీ, కనీసం సెకండ్ హీరోయిన్‌గానైనా అవకాశం రాలేదు. దాంతో ఏం చెయ్యాలో తెలియక ఓ ప్రైవేట్ కంపెనీలో చేరింది.
 
సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తాం.. ఇదిగో అదిగో అంటూ చాలానే డబ్బు గుంజుకున్నారు. ఈ విషయంలో తల్లికీ, తనకీ పలు సార్లు గొడవలు జరిగేవి. ఈ క్రమంలో సినిమాల్లో వుండాలనుకుంది. అయితే తరచూ ఇబ్బందులే ఎదురుకావడంతో ఇక ఈ లోకంలో వుండకూడదని డిసైడ్ అయ్యింది. 
 
ఆ యువతి నివసిస్తున్న ఒషివారాలోని లోఖండ్‌వాలా ఏరియాలో ఉన్న కెన్ వుడ్ భవనం నుంచి దూకేసింది. గస్తీ తిరుగుతున్న పోలీసులుకు పెద్ద శబ్ధం వినిపించింది. మొదట పూల కుండీ ఏదైనా పడిపోయిందేమో అని అనుమానం వచ్చింది. దగ్గరకు వచ్చే సరికి రక్తపు మడుగులో పడిఉన్న యువతి కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.