గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 31 జులై 2019 (14:31 IST)

ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ బ‌యోపిక్... నిర్మాత ఎవ‌రో తెలుసా..?

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్... ఇలా ఏ వుడ్‌లో అయినా స‌రే... ప్ర‌జెంట్ బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కు చాలా బ‌యోపిక్‌లు వ‌చ్చాయి. ఈసారి శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ కూడా తెరకెక్కనుంది. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించనున్నాడు. 
 
ఇక ఈ మూవీకి 800 అనే టైటిల్‌ను కూడా దాదాపు ఖరారు చేశారు. మురళీధరన్ టెస్ట్ కెరీర్‌లో 800 వికెట్లు పడగొట్టి తనకంటూ హిస్టరీ క్రియేట్ చేసుకున్నాడు. దీంతో సినిమా టైటిల్ కూడా ‘800’ ఫిక్స్ చేశారని సమాచారం. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రం ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తుండగా.. ‘దార్ మీడియా ప్రొడక్షన్స్’ నిర్మిస్తోంది.
 
తాజాగా ఈ నిర్మాణంలో సురేష్ ప్రొడక్షన్స్ కూడా భాగస్వామ్యం అయ్యింది. ఈ చిత్రంలో భాగస్వామ్యం కావడం చాలా ఆనందం ఉన్నదని దగ్గుబాటి రానా తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. ఈ ట్వీట్‌ను విజయ్‌ సేతుపతి, ముత్తయ్య మురళీధరన్, సురేష్ ప్రొడక్షన్స్, దార్ మీడియాకు రానా ట్యాగ్ చేశారు. మ‌రి... ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ తెరపై ఏం చేస్తాడో చూడాలి.