సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 6 జూన్ 2019 (17:13 IST)

మత్తుమందు కలిపేశారు.. వంటగదిలో కెళ్తే.. కౌగిలించుకున్నారు.. అరెస్ట్

సినిమాల్లో నటించే ఛాన్స్ ఇప్పిస్తామని... మోడల్‌పై నిర్మాత, సంగీత దర్శకుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ముంబైలో పెను సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని సర్కోబ్ ప్రాంతానికి చెందిన మోడల్.. నిర్మాత ముద్రాసింగ్ వద్దకు వెళ్లింది. అతనితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఓ రోజు సినిమా ఛాన్స్ కోసం మాట్లాడాలని మోడల్‌ను ముద్రాసింగ్ పిలిపించాడు. 
 
అక్కడ కరణ్ వాహి అనే మ్యూజిక్ డైరక్టర్‌ను మోడల్‌కు పరిచయం చేశాడు. ఈ సందర్భంగా మోడల్‌ను తమ సినిమాలో సహ నిర్మాతగా పనిచేయాలని అడిగారు. ఆపై ఎందుకో ఆ మోడల్ వంటగదికి వెళ్లి నీళ్లు తాగాలనుకుంది. ఆమెను అనుసరించిన నిర్మాత ఆమెను కౌగిలించుకుని ముద్దుపెట్టుకున్నాడు. దీంతో షాకైన మోడల్ వెలుపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది. 
 
కానీ స్పృహ తప్పి పడిపోయింది. చివరికి మరుసటి రోజు స్పృహలోకి వచ్చిన మోడల్.. ఒళ్లంతా గాయాలు కావడంతో పాటు నీరసంగా వుండటాన్ని గమనించింది. ఆ తర్వాత తాను భుజించిన ఆహారంలో మత్తు మందు కలిపి ఇచ్చిన నిర్మాత, మ్యూజిక్ డైరక్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారనే విషయాన్ని తెలుసుకుంది. దీనిపై మోడల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిర్మాత, మ్యూజిక్ డైరక్టర్‌లను అరెస్ట్ చేశారు.