శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 8 మే 2019 (13:26 IST)

'మహర్షి' నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'మహర్షి'. ఈ చిత్రాన్ని ముగ్గురు నిర్మాతలు కలిసి నిర్మించారు. వారిలో ఒకరు దిల్ రాజు. ఈయన ఇంట్లో బుధవారం ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు. 
 
'మహర్షి' చిత్రం ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలకానుంది. ఈ నేపథ్యంలో 'దిల్' రాజు ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు జరిగాయి. హైద‌రాబాద్‌, శ్రీన‌గ‌ర్ కాల‌నీలోని 'దిల్' రాజు కార్యాల‌యంలో ఐటీ సోదాలు జరిగాయి. ఐటీ బృందం ప‌లు రికార్డుల‌ని ప‌రిశీలించారు. 
 
గ‌తంలోనూ భారీ చిత్రాల రిలీజ్ స‌మ‌యంలో నిర్మాత‌ల ఆఫీసులు, ఇళ్ల‌పై ఐటీ సోదాలు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. 'మ‌హ‌ర్షి' చిత్రం మ‌హేష్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్క‌గా ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. 
 
వంశీ పైడిపల్లి దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటించాడు. జగపతి బాబు విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు.