"ఆ మూవీలు చూసేవారికి లేని ఇబ్బంది మీకెందుకయ్యా : ఏక్తా కపూర్
ఇటీవలి కాలంలో వచ్చే చిత్రాల్లో అడల్ట్ కంటెంట్ అధిక మోతాదులో ఉంటుంది. ఈ తరహా సినిమాలను చూసేందుకు యువత అమితాసక్తి చూపుతోంది. అయితే, మహిళా సంఘాలు, ఎన్జీవో సంస్థలు మాత్రం ఈ తరహా కంటెంట్ మూవీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇకపోతే, బాలీవుడ్‌లో ఏక్తా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో కంటెంట్ కంటే ముఖ్యంగా అడల్ట్ సీన్స్ ఉంటే చాలనుకునే నిర్మాత ఈమె. హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూడొచ్చేమో అనుకునే సెక్స్ సీన్స్ అన్నింటినీ బాలీవుడ్‌కు పరిచయం చేసింది.
ఇక ఇప్పుడు సెక్స్ కంటెంట్ బ్యాన్ చేయాలి.. దీనివల్ల యువతతో పాటు అందరూ చెడిపోతున్నారంటూ పెద్ద ఎత్తున దుమారం రేగుతుందని చాలా మంది గగ్గోలు పెడుతున్నారు. దీనిపై కోర్టు కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మరీ ఎక్కువగా ఉండే సెక్స్ కంటెంట్ అప్‌లోడ్ చేయడం కూడా నేరమే అని తేల్చేసింది. అలాంటి సన్నివేశాలున్న వెబ్ సిరీస్‌లు సైతం బ్యాన్ చేయొచ్చని కోర్ట్ తీర్పు ఇచ్చేసరికి అసలు సంచలనాలు మొదలయ్యాయి.
దీనిపై ఏక్తా కపూర్ స్పందించింది. తన వరకు సెక్స్ అనే పదంతో ఎలాంటి సమస్య లేదని చెబుతుంది. పైగా సెక్స్ ఒక్కటే అన్నింటికీ సమస్య అవుతుందనుకోవడం నిజంగానే అవివేకం అంటుంది. అయినా సెక్స్ సినిమాల్లో నటించే వాళ్లకు.. చూసే వాళ్లకు లేని ఇబ్బంది మీకెందుకు అంటూ ఎదురు ప్రశ్న వేస్తోంది.
ప్రతీ విషయంలో మంచి చెడు రెండూ ఉంటాయని.. అలాంటి వాటిని తీసుకోవడంలోనే మన విజ్ఞత తెలుస్తుందని చెబుతుంది. పైగా మన సమాజంలో దేన్నైనా బ్యాన్ చేస్తే దానిపై ఇంకా మోజు పెరిగిపోతుందని, అప్పుడు సెక్స్ కంటెంట్ కోసం జనాలు మరింతగా పిచ్చెక్కిపోతారని ఏక్తాకపూర్ చెప్పుకొస్తోంది.