శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 11 మే 2019 (14:48 IST)

కోరుకున్న ప్రేయసితో పెళ్లైంది.. భార్యకు జలుబు చేసిందని మందులు కొనేందుకు వెళ్తే..?

రెండేళ్లు ప్రేమించాడు.. రెండు రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. ఇంతలోనే విధి వక్రించింది. రైలు ప్రమాదంలో కొత్త పెళ్లి కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పచ్చని పందరితో వున్న ఆ ఇంట శోకసంద్రంలో మునిగిపోయింది.


ఇక కోరుకున్న ప్రేమికుడితో వివాహం జరిగిందనే సంతోషం ఆ వధువుకు రెండు రోజులు కూడా నిలవలేదు. కాళ్ల పారాణి ఆరకముందే వధువుకు తీరని దుఃఖం మిగిలిపోయింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. దేవునిపల్లి గ్రామానికి చెందిన కిశోర్‌‌కు తను ప్రేమించిన అమ్మాయితో రెండు రోజుల క్రితం వివాహం జరిగింది. ఈ సమయంలో భార్యకు జలుబు చేసింది. దీంతో ఆమెకు మందులు తీసుకరావడం కోసం బయటకు వచ్చాడు. 
 
ఈ క్రమంలో ఏదో ఆలోచిస్తూ సమీపంలో ఉన్న రైలు పట్టాలు దాటుతున్న సమయంలో కాచిగూడ నుంచి నిజామాబాద్‌ వెళ్తున్న డెమో ప్యాసింజర్‌ వేగంగా ఢీ కొట్టింది.

దీంతో తీవ్ర గాయాలైన కిశోర్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. కుమారుడి ప్రమాద వార్త తెలుసుకుని అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు, భార్య విలపించిన తీరు అక్కడి ఉన్నవారిని కలిచివేశాయి.