రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్
మంత్రముగ్ధులను చేసే కళ్ళు, అంతే మంత్రముగ్ధులను చేసే చిరునవ్వు కలిగిన భాగ్యశ్రీ బోర్సెకూ రామ్ పోతినేని రిలేషన్ షిప్ లో వున్నారనే వార్తలు వచ్చాయి. దీనిపై భాగ్యశ్రీ సోషల్ మీడియాలో కూడా స్పందించింది. ఆమె చేతికి ఉంగరం ధరించివుండడం చూసిన నెటిజన్లు ప్రేమ వ్యవహారం గురించి అడిగితే, అది నేనే కొనుక్కున్నానని అని చెప్పింది. ఆ తర్వాత ఆమె రామ్ పోతినేని సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా నిర్మాణ సంస్థ మైత్రీమూవీస్ మేకర్స్ శుభాకాంక్షలు చెబుతూ న్యూ లుక్ విడుదల చేశారు.
రామ్ నటించే 22వ సినిమాలో ఆమె నటిస్తోంది. ఇటీవలే కొంత షూట్ కూడా చేశారు. గత ఏడాది భాగ్యశ్రీ బోర్సే "మిస్టర్ బచ్చన్", "చందు ఛాంపియన్ చిత్రాల్లో నటించింది. తాజాగా విజయ్ దేవరకొండతో "కింగ్‌డమ్" సినిమాలో నటించింది. కింగ్ డమ్ లో మాత్రం లిప్ కిస్ లో లీనమై నటించిన వీడియో కూడా ఇటీవలే విడుదలైంది. అదేవిధంగా రామ్ తో నటించే సినిమాలో వీరి మధ్య కెమిస్ట్రీ హైలైట్ అవుతుందన చిత్రయూనిట్ తెలియజేస్తుంది. త్వరలో వీరిద్దరి పై ఓ సాంగ్ చిత్రీకరించనున్నారు.
ఇదిలా వుండగా, ఇప్పటికే సక్సెస్ లేని బోర్సె, సక్సెస్ కోసం ఆరాటపడుతున్న హీరోలతో కలిసి నటించడం విశేషం. రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ సినిమాల్లో విజయం సాధిస్తాననే నమ్మకాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా అభిమానులను ఉత్సాహపరిచింది.