శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 29 జూన్ 2019 (09:29 IST)

భారీ చిత్రానికి నిర్మాతగా కొరటాల?

దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకున్న డైరెక్టర్ కొరటాల శివ. మెగా ఫోన్‌ని వదిలి నిర్మాతగా అవతరించనున్నారా? అనే ప్రశ్నకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ ఔననే సమాధానం ఇస్తున్నారు.
 
వివరాలలోకి వెళ్తే... కొరటాల శివ తన తదుపరి సినిమాను చిరంజీవితో చేయనున్నారు. దీనికి సంబంధించిన సన్నాహాలు ప్రస్తుతం చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఆగస్టులో జరగనున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఆయన ఒక భారీ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారనే వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమా ఆయన తన స్నేహితులతో కలిసి నిర్మించనున్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
ఈ సినిమా ఒక స్టార్ హీరోతో సెట్స్ పైకి వెళ్లనుందనీ, దర్శకుడు ఎవరనేది త్వరలోనే ప్రకటించనున్నారనీ అంటున్నారు. దర్శకుడిగా ఇంతవరకూ అపజయం అనేది ఎరుగని కొరటాల... నిర్మాతగా వేస్తోన్న తొలి అడుగులు ఎంతవరకూ సక్సెస్ అవుతాయో వేచి చూడాల్సిందే.