శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 18 జూన్ 2019 (11:26 IST)

తేజ అంటే కాజ‌ల్‌కి అంత ప్రేమా..? అందుకే అలా చేస్తుందా..?

చిత్రం సినిమాతో సంచ‌ల‌నం సృష్టించిన సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ తేజ‌. ఆ త‌ర్వాత ఒకే త‌ర‌హా చిత్రాలు చేయ‌డం వ‌ల‌న కెరీర్లో వెన‌క‌బ‌డ్డాడు. ఇటీవ‌ల నేనే రాజు నేనే మంత్రి సినిమాతో స‌క్స‌స్ సాధించి స‌క్స‌స్ ట్రాక్ లోకి వ‌చ్చాడు. ఇంత‌లో సీత అనే సినిమా తీసి మ‌ళ్లీ ఫ్లాప్ సినిమా అందించాడు. 
 
అయితే... ఈ సినిమా సెట్స్ పైన ఉండ‌గానే.. కాజ‌ల్‌తో మ‌రో సినిమా చేయ‌నున్నాడు అని వార్త‌లు వ‌చ్చాయి. ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ అని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే... సీత సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో కాజ‌ల్‌తో లేడీ ఓరియంటెడ్ మూవీ ఉండ‌దు అంటూ వార్త‌లు వ‌చ్చాయి. కానీ... ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంద‌ట‌. 
 
మ‌రో విష‌యం ఏంటంటే.. తేజ కోసం ఈ సినిమాని త‌నే నిర్మిస్తానంటుంద‌ట కాజ‌ల్. ఇంత‌కీ తేజ అంటే అంత ప్రేమ ఎందుకంటారా..? అస‌లు కాజ‌ల్‌ని తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేసింది తేజ‌నే కదా. ఆ.. కృత‌జ్ఞ‌త‌తో అనుకుంటా తేజ కోసం నిర్మాత‌గా మార‌డానికి కూడా రెడీ అంటుంద‌ట కాజ‌ల్. మ‌రి... ఈసారి ఎలాంటి చిత్రాన్ని అందిస్తాడో చూడాలి.