సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : బుధవారం, 22 మే 2019 (16:52 IST)

‘రెడీ రెడీ’ అంటూ రెచ్చగొట్టేస్తోన్న తమన్నా (video)

ప్రభుదేవా, త‌మ‌న్నా జంట‌గా న‌టించి తెలుగులో ఘన విజ‌యం సాధించిన ‘అభినేత్రి’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ‘అభినేత్రి 2’ చిత్రం మే 31వ తేదీన విడుద‌ల కాబోతున్న విషయం తెలిసిందే.


ఇందులో ప్ర‌భుదేవా, త‌మ‌న్నాలతోపాటు నందితా శ్వేత, స‌ప్త‌గిరి, సోనూసూద్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రానికి విజ‌య్ ద‌ర్శ‌కత్వం వహించగా... అభిషేక్ నామా, ఆర్‌. ర‌వీంద్ర‌న్‌లు సంయుక్తంగా నిర్మించడం జరిగింది.
 
కాగా... సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్ర యూనిట్ ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఒక వీడియో సాంగ్‌ను విడుదల చేయడం జరిగింది. ‘రెడీ రెడీ’ అంటూ సాగే ఈ సాంగ్‌లో తమన్నా తన అందం, డ్యాన్స్‌ మూమెంట్‌లతో అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా.. కుర్రకారుకు హీట్ పెంచే డ్రస్సులతో రెచ్చగొట్టేస్తోందంటున్నారు చూసిన జనాలు. ఈ సినిమా కోసం తమన్నా ఎంతగా కష్టపడిందో.. ఈ సాంగ్ చూస్తేనే తెలుస్తోంది. ఇప్పుడీ పాట సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.