రాజు గారి గది 3లో ఆ హీరోయిన్ భయపెట్టబోతోందా?
ప్రముఖ వ్యాఖ్యాత ఓంకార్ తమ తమ్ముడిని హీరోగా పెట్టి, డైరెక్ట్ చేసిన రాజు గారి గది సినిమా చిన్న చిత్రం అయినప్పటికీ మంచి విజయం సాధించింది. ఇందులో ధన్య హీరోయిన్‌గా నటించింది. హారర్ నేపథ్యంలో సాగే కథనంతో రూపొందించిన ఈ సినిమాలో చివరిగా దెయ్యాలు కాదు, మొత్తం చేస్తోంది మనుషులే అని ముగించడం జరిగింది.
ఇక దీనికి సీక్వెల్‌గా వచ్చిన రాజు గారి గది 2 సినిమా తీసాడు. ఇందులో సమంత దెయ్యం పాత్రలో నటించగా, నాగార్జున ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ ఓంకార్ దర్శకత్వం, సమంత, నాగార్జునల నటనకు మంచి మార్కులే పడ్డాయి.
తాజా ఓంకార్ రాజు గారి గది 3 తీయడానికి ప్లాన్ చేస్తున్నారంట. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం మిల్కీ బ్యూటీ తమన్నా అయితే బాగుంటుందని భావించిన ఓంకార్ ఆమెను సంప్రదించారట.
ఇప్పటికే అభినేత్రి సినిమాలో దెయ్యంగా నటించిన ఈ గ్లామర్ డాల్ మరి ఈ సినిమాలో నటించడంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. చాలాకాలం తర్వాత ఎఫ్2తో విజయాన్ని అందుకున్న తమన్నా మళ్లీ గ్లామర్ రోల్‌లో కనిపించనుందా లేక లేడీ ఓరియెంటెడ్ పాత్రలో మెప్పించనుందో తెలియాలంటే వేచి ఉండాలి మరి.