గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శుక్రవారం, 7 జూన్ 2019 (19:18 IST)

రొమాంటిక్ సినిమా తీస్తానంటున్న భక్తి సినిమాల దర్సకుడు...

వరుసగా మూడు ఫ్లాప్‌లు. అవి కూడా భక్తి సినిమాలే. పాండురంగడు, ఓం నమోవేంకటేశాయ ఇలా భక్తి సినిమాలు తీసినా ఆ సినిమాలు అస్సలు ఆడలేదు. దీంతో ఆ దర్సకుడు సినిమాలకు దూరమైపోయాడు. ఇక మెగాఫోన్ పట్టుకుంటాడా లేదా అన్న అనుమానం అందరిలోను మొదలైంది.
 
108 సినిమాలు తీసిన దర్సకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఇక సినిమాలు తీసే అవకాశం లేదన్న ప్రచారం జరిగింది. ప్రచారం జరిగిన విధంగానే రాఘవేంద్రరావు కూడా సినిమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. అయితే ప్రస్తుతం మెగా ఫోన్ మళ్ళీ పట్టేందుకు సిద్థమయ్యాడు రాఘవేంద్రరావు. 109వ సినిమా తీస్తున్నట్లు ఎన్టీఆర్ జయంతిరోజు ప్రకటించారు.
 
అది కూడా రొమాంటిక్ సినిమా తీసి భారీ హిట్ కొడతానన్న ధీమాను వ్యక్తం చేశారు. దర్సకేంద్రుడు సినిమాలో నటించేందుకు యువ నటులు పోటీలు పడుతున్నారు. ఇప్పటికే కొంతమంది నటులు దర్సకేంద్రుడికి ఫోన్లు కూడా చేసేశారట. అయితే ఈసారి కొత్త హీరోహీరోయిన్లతో సినిమా చేయాలన్న నిర్ణయానికి దర్సకేంద్రుడు వచ్చినట్లు తెలుస్తోంది. భక్తి భావాల సినిమాలను తీసే రాఘవేంద్రరావు ఒక్కసారిగా రొమాంటిక్ సినిమాలు తీస్తున్నారని తెలియడంతో సినీపరిశ్రమలో చర్చ మొదలైంది. త్వరలో రాఘవేంద్రరావు సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోంది.