శ్రీదేవిని చేసినట్లుగా తనను చేయాలని బోనీకపూర్ వద్దకు వెళ్ళిన తమన్నా..?

జె| Last Modified బుధవారం, 12 జూన్ 2019 (13:35 IST)
శ్రీదేవి జీవిత చరిత్రలో నటించడం తన డ్రీమ్ అంటోంది తమన్నా. శ్రీదేవి అంటే చెప్పలేనంత ఇష్టమట. మరి శ్రీదేవి బయోపిక్‌లో తమన్నాకు ఛాన్స్ ఇస్తారా. అసలు అతిలోక సుందరి బయోపిక్‌ను ఎవరు తీస్తున్నారు. శ్రీదేవి జీవిత చరిత్రలో నటించాలని ఎప్పటి నుంచో ఉందంటోంది తమన్నా. అతిలోక సుందరి శ్రీదేవి గత యేడాది దుబాయ్‌లో కన్నుమూశారు. ఆమె మరణించిన తరువాత శ్రీదేవి జీవిత చరిత్ర తీయాలని పలువురు దర్శకులు ప్రయత్నించారు. కానీ ఆమె బయోపిక్‌ను తీసేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదని ఆమె భర్త బోనీకపూర్ చెప్పుకొచ్చారు.

అయితే ఎవరు బయోపిక్ తీసినా తనకు మాత్రం అవకాశం ఇవ్వాలని కోరుతోంది తమన్నా. ఈ విషయాన్ని స్వయంగా బోనీకపూర్‌కు కూడా చెప్పిందట. శ్రీదేవి బయోపిక్ ఎప్పుడు తీసినా తనతోనే ప్లాన్ చేయమని కోరిందట. శ్రీదేవి అంటే అంత ఇష్టమని చెబుతోందట. శ్రీదేవి నటించిన హిమ్మత్‌వాలా రీమేక్‌లోను తమన్నానే నటించింది. శ్రీదేవి హిందీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ హిమ్మత్‌వాలా. ఆ సినిమాను మళ్ళీ రీమేక్ చేసినప్పుడు ఆ రోల్‌ను తమన్నా చేసింది.

తమన్నా డ్యాన్స్‌ను, ఆమె అందాన్ని తమన్నా రెయిజ్ చేసింది అప్పట్లో. తమన్నా ఇప్పుడు ఒక హిందీ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా ప్రమోషనలో భాగంగా తన మనస్సులోని మాటను బయటపెట్టింది తమన్నా. ఈ యేడాది ఎఫ్‌-2 సినిమాతో భారీ హిట్ అందుకున్న తమన్నా తాజాగా అభినేత్రి-2లో నటించింది.దీనిపై మరింత చదవండి :