మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: మంగళవారం, 24 జులై 2018 (15:23 IST)

'వీరభోగ వసంత రాయలు'లో నారా రోహిత్ లుక్

నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ' వీర భోగ వసంత రాయలు'.. రేపు నారా రోహిత్ బర్త్ డే సందర్భంగా అయన ఫస్ట్ లుక్‌ను ఈరోజు రిలీజ్ చేసింది చిత్ర బృందం.. పోస్టర్లో 'హిట్ మ్యాన్ అని ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో నారా రోహిత్‌ని పిలుస్తుండటం అందరిలో ఆసక్త

నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ' వీర భోగ వసంత రాయలు'.. రేపు నారా రోహిత్ బర్త్ డే సందర్భంగా అయన ఫస్ట్ లుక్‌ను ఈరోజు రిలీజ్ చేసింది చిత్ర బృందం.. పోస్టర్లో 'హిట్ మ్యాన్ అని ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో నారా రోహిత్‌ని పిలుస్తుండటం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది. చిత్రంలోని ఆయన పాత్ర స్వభావం కూడా అలానే ఉండబోతుందని ఫస్ట్ లుక్ ద్వారా చెప్పకనే చెప్పేశారు మేకర్స్. 
 
మెనాసింగ్ కల్ట్ లుక్‌గా మేకర్స్ రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్‌లో నారా రోహిత్ చాలా సీరియస్‌గా తన హావభావాలను కనపరుస్తూ సినిమాపై అందరిలో ఇంట్రెస్ట్‌ని కలగజేస్తున్నాడు. ఎంతో వైవిధ్యంగా, కొత్తగా సినిమా ఫస్ట్ లుక్స్‌ని రిలీజ్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీని, ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచుతున్నారు. ఆర్.ఇంద్రసేన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రియ శరన్, శ్రీవిష్ణు, సుధీర్ బాబులు ముఖ్యపాత్రల్లో నటించారు. మార్క్ కే రాబిన్ సంగీతం వహించారు. 
 
తారాగణం : నారా రోహిత్, శ్రీయా శరణ్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాష్, నవీన్ నేని, చరిత్ మానస్, స్నేహిత్, ఏడిద శ్రీరామ్, గిరిధర్, అనంత ప్రభు, రాజేశ్వరి, అశ్వితి మరియు ఇతరులు, సాంకేతిక నిపుణులు : దర్శకుడు: ఇంద్రసేన, నిర్మాత: అప్పారావ్ బెళ్ళన, బ్యానర్: బాబా క్రియేషన్స్, సంగీతం: మార్క్ కె రాబిన్, DoP: S వెంకట్, ఆర్ట్ డైరెక్టర్: శ్రీకాంత్ రమిశెట్టి, ఎడిటర్ : శశాంక్ మాలి, యాక్షన్: రామ్ సుంకర, పబ్లిసిటీ డిజైనర్: అనిల్-భాను.