ఢిల్లీలో ఎయిర్‌హోస్టెస్ అనుమానాస్పద మృతి... ఎందుకు?
రాజధాని ఢిల్లీ నగరంలో ఓ ఎయిర్‌హోస్టెస్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆమె భర్త ఇది ఆత్మహత్య అని చెప్తుండగా.. యువతి తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిని హత్య చేశారని ఆరోపిస్తున్నారు. సోమవారం వెలుగులోకి
రాజధాని ఢిల్లీ నగరంలో ఓ ఎయిర్‌హోస్టెస్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆమె భర్త ఇది ఆత్మహత్య అని చెప్తుండగా.. యువతి తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిని హత్య చేశారని ఆరోపిస్తున్నారు. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
ఢిల్లీకి చెందిన అనిస్సియా భత్రా అనే 32 ఏళ్ల యువతి లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్నారు. దక్షిణ దిల్లీలోని పంచశీల పార్కు ప్రాంతంలోని ఇంటిపై నుంచి శుక్రవారం రాత్రి దూకడంతో ప్రాణాలు కోల్పోయారని పోలీసులు చెబుతున్నారు. అయితే కొంతకాలంగా అత్తింటి వారు ఆమెను వేధిస్తున్నారని.. ఇది హత్యే అని అనిస్సియా తల్లిదండ్రులు వెల్లడించారు.
అనిస్సియాకు రెండేళ్ల క్రితం మయాంక్ సింఘ్వితో వివాహమైందని, అప్పటి నుంచి ఆమె భర్తతో పాటు అత్తింటి వారంతా వేధిస్తున్నారని అనిస్సియా తండ్రి విశ్రాంత మేజర్ జనరల్ ఆర్‌ఎస్ భత్రా ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం తాగి వచ్చి ఆమెను డబ్బు కావాలని హింసిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెకు ఏదైనా జరిగితే వారిదే బాధ్యత అని రాతపూర్వకంగా పోలీసులు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు.
ఇది జరిగిన కొద్ది రోజులకే అనిస్సియా విగతజీవిగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి సింఘ్వి కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. అనిస్సియా టెర్రస్‌పై నుంచి దూకడానికి కొన్ని నిమిషాల ముందే చనిపోబోతున్నానని మెసేజ్ పంపిందని అప్పుడు తాను ఇంట్లోనే ఉన్నానని, కానీ టెర్రస్‌పైకి వెళ్లేసరికి దూకేసిందని మయాంక్ సింఘ్వి పోలీసులకు తెలిపారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లానని, అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు వెల్లడించారని సింఘ్వి చెప్పాడు.