శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : ఆదివారం, 1 జులై 2018 (11:31 IST)

పెద్దపులితో సెల్ఫీ దిగి ఫోటో పోస్ట్ చేసిన నవదీప్..

ట్రాఫిక్ సిగ్నల్‌పై సెటైర్ వేశాడు యంగ్ హీరో నవదీప్. ట్రాఫిక్ సిగ్నల్‌ పిక్‌ని పోస్టు చేశాడు. ట్రాఫిక్ సిగ్నల్‌లో రెడ్‌లైట్ ఆన్‌లో వుండగానే.. గ్రీన్ లైట్స్.. లెఫ్ట్, స్ట్రయిట్ డైరక్షన్స్ సూచిస్తోంది. ఈ

ట్రాఫిక్ సిగ్నల్‌పై సెటైర్ వేశాడు యంగ్ హీరో నవదీప్. ట్రాఫిక్ సిగ్నల్‌ పిక్‌ని పోస్టు చేశాడు. ట్రాఫిక్ సిగ్నల్‌లో రెడ్‌లైట్ ఆన్‌లో వుండగానే.. గ్రీన్ లైట్స్.. లెఫ్ట్, స్ట్రయిట్ డైరక్షన్స్ సూచిస్తోంది. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు కూడా అంతే సరదాగా స్పందిస్తున్నారు. తాజాగా నవదీప్ పెద్దపులితో సెల్ఫీ దిగి ఆ ఫోటోను పోస్టు చేశాడు. 
 
''ఏరా పులీ'' అంటూ సూపర్ హిట్ చిత్రం "యమదొంగ"లోని డైలాగ్‌ను గుర్తుకు తెస్తున్నాడు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా కనిపించే నవదీప్, తాజాగా ట్రాఫిక్‌పై ఓ సెటైర్ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఫొటోను పోస్టు చేసి సినీ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. ఓ అడవిలోకి వెళ్లిన నవదీప్.. అక్కడ పెద్ద పెద్దపులితో సెల్ఫీ దిగాడు. అయితే ఈ ఫోటో ఎక్కడ తీశాడనేది తెలియలేదు.