1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 4 అక్టోబరు 2016 (15:40 IST)

గ్లామర్ డోస్ పెంచేసిన నయనతార.. పారితోషికం కూడా రూ.4కోట్లు డిమాండ్ చేస్తోందట..

టాలీవుడ్‌లో బాబు బంగారం, తమిళంలో ఇరుముగన్ సినిమాలతో మాంచి హిట్ కొట్టేసిన నయనతార ప్రస్తుతం భారీ ఆఫర్లను కైవసం చేసుకుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా హీరోలతో నటించేసే నయనతార గ్లామర్ ఫేడవుట్ కాకముందే.. తన

టాలీవుడ్‌లో బాబు బంగారం, తమిళంలో ఇరుముగన్ సినిమాలతో మాంచి హిట్ కొట్టేసిన నయనతార ప్రస్తుతం భారీ ఆఫర్లను కైవసం చేసుకుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా హీరోలతో నటించేసే నయనతార గ్లామర్ ఫేడవుట్ కాకముందే.. తన గ్లామర్‌కు మరింత వన్నె తెచ్చేందుకు మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే నాలుగు సినిమాలు అమ్మడి చేతిలో ఉన్నాయి.
 
సాధారణంగా మూడు పదుల వయసొచ్చే సరికి హీరోయిన్లకు క్రేజ్ తగ్గిపోతుంది. కానీ నయన మాత్రం చాలా జాగ్రత్తలు పడుతోంది. తనలో గ్లామర్ తగ్గకుండా ఉండేందుకు హెవీ వర్కవుట్స్ చేస్తోందట. అందాన్ని పెంచుకునే దిశగా డైట్ ఫాలో కావడమే కాకుండా ఎక్సర్‌సైజ్, యోగా వంటివి చేస్తూ.. శరీరాకృతిలో తేడా రాకూడదని భావిస్తోంది. 
 
పనిలో పనిగా డిమాండ్ పెరగడంతో.. రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసిందట నయన్. అంటే ఒకటీ అరా. కాదు. ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తోందట. దీంతో దక్షిణాదిన అత్యధిక పారితోషికం పుచ్చుకునే హీరోయిన్స్ లిస్టులో నయన చోటు దక్కించుకుంది. దీంతో నిర్మాతలు షాక్ తింటున్నారు.