శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By tj
Last Updated : శనివారం, 27 జనవరి 2018 (15:48 IST)

తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వ్యక్తులు ఉన్నారా? - నయనతార

హీరోల కన్నా కొంతమంది హీరోయిన్లే ఎక్కువగా కొన్ని విషయాల్లో తలదూరుస్తూ అనవసరంగా ఇరుక్కుంటున్నారు. ఇప్పుడు తాజాగా హీరోయిన్ నయనతార అదేపని చేశారు. తెలుగు సినీపరిశ్రమ నయనతారకు ఎంతో గుర్తింపు నిచ్చింది.

హీరోల కన్నా కొంతమంది హీరోయిన్లే ఎక్కువగా కొన్ని విషయాల్లో తలదూరుస్తూ అనవసరంగా ఇరుక్కుంటున్నారు. ఇప్పుడు తాజాగా హీరోయిన్ నయనతార అదేపని చేశారు. తెలుగు సినీపరిశ్రమ నయనతారకు ఎంతో గుర్తింపు నిచ్చింది. మంచి హీరోయిన్‌గా తెలుగు సినీపరిశ్రమలో నయనతారను గౌరవిస్తారు. సీనియర్ హీరోలతో కలిసి కలిసి పనిచేయడమేకాకుండా సీనియర్ నటీనటులతో పనిచేసిన అనుభవం నయనతారది. ఇక్కడ ఎలాంటి టాలెంట్ ఉన్న నటులు ఉన్నారన్నది ఆమెకు బాగా తెలుసు. 
 
అలాంటిది నయనతార తెలుగు సినీపరిశ్రమలోని నటీనటులను చులకన చేస్తూ హేళనగా మాట్లాడారు. తమిళ నటీనటులకు మంచి ప్రతిభ ఉంది, తెలుగు సినీపరిశ్రమలో నాకు అది కనిపించడం లేదని చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు నయనతార వ్యాఖ్యలు హాట్ టాపిక్‍గా మారింది. తెలుగు సినీపరిశ్రమ మొత్తం నయనతార వ్యాఖ్యపై గుర్రుగా ఉంది.