సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 17 జనవరి 2018 (21:00 IST)

కత్తి మహేశ్ అమ్మాయిలకు అసభ్య సందేశాలు పంపేవాడు... రేపు చూడండి... నిర్మాత సంచలనం

కత్తి మహేష్ పైన సినీ నిర్మాత రాంకీ తీవ్ర ఆరోపణల చేయడం సంచలనం రేపుతోంది. ఇటీవలి కాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన వరుసగా సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో వరుసగా కామెంట్లు చేస్తూ వస్తున్న కత్తిపై రాంకీ చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఏబీఎ

కత్తి మహేష్ పైన సినీ నిర్మాత రాంకీ తీవ్ర ఆరోపణల చేయడం సంచలనం రేపుతోంది. ఇటీవలి కాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన వరుసగా సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో వరుసగా కామెంట్లు చేస్తూ వస్తున్న కత్తిపై రాంకీ చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఏబీఎన్ టీవీ చానల్ తో మాట్లాడుతూ... కత్తి మహేష్ తనకు మోహన్ రావిపాటి ద్వారా పరిచయమయ్యాడని చెప్పారు. 
 
కత్తి మహేష్ గురించి తనకు బాగా తెలుసుననీ, అతడు సినీ ఇండస్ట్రీకి పట్టిన చీడపురుగని విమర్శించారు. అంతేకాదు... అమ్మాయిలకు మహేశ్ అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టేవాడని ఆరోపించారు. కత్తి స్త్రీ లోలుడని చెప్పారు. కత్తి మహేశ్‌కు సంబంధించి మరిన్ని సంచలనాలను రేపు ఉదయం వెల్లడిస్తానంటూ బాంబు పేల్చారు.