సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 9 జనవరి 2018 (12:10 IST)

మంత్రి కొల్లు వ్యాఖ్యలు... నటి పూనమ్ కౌర్‌కి కత్తి మహేష్ క్షమాపణలు చెప్తారా?

నటి పూనమ్ కౌర్ ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ అంటూ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు ఏపీ చేనేతశాఖా మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి వెళ్లింది. దీనిపై మంత్రి మాట్లాడుతూ... తను చేనేత మంత్రిగా ఉన్న‌ప్పుడు ఎవ‌రినీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంపిక చేయలేదన్నారు. బ్రాండ్ అ

నటి పూనమ్ కౌర్ ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ అంటూ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు ఏపీ చేనేతశాఖా మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి వెళ్లింది. దీనిపై మంత్రి మాట్లాడుతూ... తను చేనేత మంత్రిగా ఉన్న‌ప్పుడు ఎవ‌రినీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంపిక చేయలేదన్నారు. బ్రాండ్ అంబాసిడ‌ర్ అనేది ప్ర‌భుత్వప‌రంగా జ‌ర‌గ‌లేద‌న్నారు. 
 
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చేనేత వ‌స్త్రాల‌కు బ్రాండ్ అంబాసీడ‌ర్‌గా వుంటే బావుంటుందని కొందరు చెప్పినట్లు వెల్లడించారు. అంతేతప్ప ప్రత్యేకంగా ఏపీలో చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఎవ్వరూ లేరని తేల్చి చెప్పారు. మరి కత్తి మహేష్ మంత్రిగారి వివరణపై ఎలా స్పందిస్తారో... పూనమ్ కౌర్‌కి క్షమాపణలు అడుగుతారో చూడాలి.