శుక్రవారం, 25 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 13 నవంబరు 2016 (12:04 IST)

నీతోనే డ్యాన్స్ సాంగ్ మేకింగ్ వీడియో.. బడా స్టార్లు వచ్చారు.. వీడియో చూడండి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ధృవ సినిమాతో షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్‌ డ్యాన్సర్‌లలో మెగా పవర్‌స్టార్‌ రామచరణ్‌ తేజ్‌ ఒకడు. తొలి సినిమాతోనే తన డ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ధృవ సినిమాతో షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్‌ డ్యాన్సర్‌లలో మెగా పవర్‌స్టార్‌ రామచరణ్‌ తేజ్‌ ఒకడు. తొలి సినిమాతోనే తన డ్యాన్సింగ్ ట్యాలెంట్‌తో మెగా ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. ప్రస్తుతం సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ‘ధృవ’ సినిమా చేస్తున్నాడు. 
 
''నీతోనే డ్యాన్స్‌" అంటూ సాగే పాట మేకింగ్‌ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ పాట షూటింగ్‌కు తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సాంగ్‌ మేకింగ్‌ వీడియోలో చెర్రీతోపాటు చిరంజీవి, అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌, శిరీష్‌, శ్రుతిహాసన్, సురేందర్ రెడ్డి తళుక్కుమన్నారు.
 
వీరే కాకుండా ఆ స్పాట్‌కు అక్కినేని వారసుడు అఖిల్‌, దర్శకులు సుకుమార్‌, కొరటాల శివ, చెర్రీ భార్య ఉపాసన కూడా పాల్గొన్నారు. ఇక, ఆ సాంగ్‌ షూటింగ్‌ సమయంలోనే హీరోయిన్‌ రకుల్‌ పుట్టినరోజు(అక్టోబర్ 10)కావడంతో ఆ రోజు సెట్‌లోనే ఆమె చేత కేక్‌ కట్‌ చేయించారు. అక్టోబర్ 9న కేక్ కట్ చేశారు.