బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 5 జనవరి 2017 (14:32 IST)

ఇక యూట్యూబ్‌లో 'నేను లోకల్' సాంగ్స్.. నెక్ట్స్ ఏంటి అనే బాణీలో?

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆడియో ఫంక్షన్లు జరగట్లేదు. ఒక్కో పాటను విడుదల చేసే సంప్రదాయం కొనసాగుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలంతా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఖైదీ 150 పాటలు కూడా ఇదే తరహాలో విడుదలై భారీ

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆడియో ఫంక్షన్లు జరగట్లేదు. ఒక్కో పాటను విడుదల చేసే సంప్రదాయం కొనసాగుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలంతా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఖైదీ 150 పాటలు కూడా ఇదే తరహాలో విడుదలై భారీ క్రేజును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేచులర్ స్టార్ నాని కూడా దీన్నే మార్గంగా ఎంచుకున్నాడు. నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నేను లోకల్’. 
 
దిల్‌రాజు నిర్మాతగా, దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా పాటలను ఒక్కొక్కటిగా యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలోని మొదటి పాట ‘నెక్ట్స్ ఏంటి’ అనే బాణీలో సాగుతుందట. ఈ పాటను జనవరి 6న సాయంత్రం 6గంటలకు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు నాని తన ఫేస్‌బుక్ పేజ్ ద్వారా వెల్లడించాడు.