శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 జనవరి 2021 (19:26 IST)

నిహారికను ఏడ్పించిన చైతన్య.. ఎందుకో ఈ వీడియో చూస్తే..? (Video)

Niharika
మెగా డాటర్ నిహారిక పెళ్లి డిసెంబర్ 9న ఉదయపూర్ కోటలో మూడు రోజుల పాటు ఘనంగా జరిగింది. ఈ పెళ్లి కోసం దాదాపు 40 కోట్ల వరకు ఖర్చు చేసారని వార్తలు కూడా బాగానే వచ్చాయి. తాజాగా పెళ్లి తర్వాత తనకు సంబంధించిన ఒక్కో వీడియోను, ఫోటోలను పోస్ట్ చేస్తుంది నిహారిక. ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ముచ్చట్లను అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసి కన్నీరు పెట్టుకుంది నిహారిక. 
 
ఒక్క ముక్కలో చెప్పాలంటే తన ప్రేమతో నిహారికను ఏడిపించేసాడు చైతన్య. అలాంటి ఓ ఎమోషనల్ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది నిహారిక కొణిదెల. పెళ్ళి జరిగిన తర్వాత కచ్చితంగా అమ్మాయిలు కన్నీరు పెట్టుకోవడం కామన్. అందులోనూ పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్లేటప్పుడు కచ్చితంగా కన్నీరు ఏరులై పారుతుంది. దాన్ని కంట్రోల్ చేయడం కూడా కష్టమే. 
 
ఇదిలా ఉంటే తాజాగా నిహారిక విషయంలో కూడా ఇదే జరిగింది. ఈమె కూడా తన పెళ్లి సమయంలోనే ఏడ్చేసింది. అందులోనూ పెళ్లి పీటల దగ్గరే వెక్కివెక్కి ఏడ్చింది. దీనికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది నిహారిక. తన ప్రేమతో నిహారిక గుండె లోతుల్లోకి నేరుగా వెళ్లిపోయాడు చైతన్య. భార్య కోసం ఓ వీడియోను సిద్ధం చేసిన చైతన్య.. అందులో కొన్ని ఎమోషనల్ మాటలు కూడా చెప్పుకొచ్చాడు.
 
అది విన్న తర్వాత ఏడ్చేసింది నిహారిక. 'డియర్ నిహా.. పెళ్లితో కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్న ఈ తరుణంలో నీకు ఒక విషయాన్ని చెప్పాలి.. 30 ఏళ్ళ నా జీవితంలో నేనేం మిస్ అయ్యానో.. ఏది కోల్పోయానో నువ్వొచ్చిన తర్వాతే తెలిసింది.. నీతో గడపబోయే ప్రతీ క్షణం శ్వాస ఆగిపోయేవరకు గుర్తు పెట్టుకుంటాను' అంటూ ఎమోషనల్ అయిపోయాడు చైతన్య జొన్నలగడ్డ. నేను నీ కోసమే పుట్టానని, నా జీవితానికి అర్థం కూడా నువ్వేనని తెలిసింది అంటూ చైతన్య చెప్పుకొచ్చాడు.
 
తన భర్త నోటి నుంచి అలా చెప్పగానే నిహారిక కళ్ళలో నుంచి నీళ్లు తిరిగాయి. ఆమె భావోద్వేగానికి లోనవ్వడంతో పక్కనే ఉన్న చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత ప్రేమతో కౌగిలించుకుంది. మరోవైపు పెళ్లి పీఠలపై కూడా నిహా చాలా ఎమోషనల్ అయిపోయింది. తాళిబొట్టు మెడలో పడగానే ఆమెకు ఆగకుండా కన్నీరు వస్తూనే ఉన్నాయి. ఏదేమైనా కూడా ఆనందంతో వచ్చిన ఈ కన్నీటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.