గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Modified: శనివారం, 23 జనవరి 2021 (23:37 IST)

మెగాస్టార్ చిరంజీవితో న‌లుగురు క‌ల‌లు నిజ‌మైన వేళ‌

ఎవ‌రికైనా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాల‌ని ద‌ర్శ‌కుల‌కు ఎయిమ్ వుంటుంది. అలాంటిది చిరంజీవి వారితో దిగిన ఫొటో పోస్ట్ చేయ‌డంతో శ‌నివారంనాడు వారంతా ట్వీట్ చేస్తూ ఆనందం వ్య‌క్తం చేశారు. ఇటీవ‌లే చిరంజీవి 153వ సినిమా ప్రారంభోత్సవం సూప‌ర్‌గుడ్ కార్యాల‌యంలో జ‌రిగింది. అక్క‌డ‌కు ప్ర‌ముఖులంతా విచ్చేశారు.
 
ఆ సంద‌ర్భంగా న‌లుగురు ద‌ర్శ‌కులు చిరుతో దిగిన ఫొటోని చిరంజీవి శుక్రవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ‘మై ఫోర్ కెప్టెన్స్ ఈ నలుగురు’ అంటూ మెహర్ రమేష్, మోహన్ రాజా, కొరటాల శివ, బాబీతో కలిసి ఉన్న ఫొటోను మెగాస్టార్ చిరంజీవి షేర్ చేశారు. ఈ నలుగురు డైరెక్టర్లలో ఇద్దరు డైరెక్టర్లు కొరటాల శివ, మోహన్ రాజాలతో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.
 
ఇక మెహర్ రమేష్, బాబీలతో కూడా సినిమాలు చేయబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ఇదివరకే ప్రకటించిన విషయం విధితమే. తన నలుగురు డైరెక్టర్లు ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటోను పోస్ట్ చేసి మెగాస్టార్ ఇలా సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ ట్వీట్‌పై నలుగురు డైరెక్టర్లూ స్పందించారు.
 
మెగాస్టార్ చిరంజీవితో ప్రస్తుతం ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్న కొరటాల శివ స్పందిస్తూ.. థ్యాంక్యూ కెప్టెన్ ఆఫ్ కెప్టెన్స్ అంటూ రిప్లయ్ ఇచ్చారు. ఇక మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమాను తెరకెక్కిస్తున్న మోహన్ రాజా స్పందిస్తూ ఫీలింగ్ ప్రౌడ్ అండ్ బ్లెస్డ్ అంటూ రిప్లయ్ ఇచ్చారు. మెహర్ రమేష్ స్పందిస్తూ.. మైలవ్, ఫ్యాన్‌డమ్, మ్యాడ్‌నెస్ టూవర్డ్స్ చిరంజీవి అన్నయ్యగారు... లైఫ్ టైమ్ డ్రీమ్ కమింగ్ అంటూ ట్వీట్ చేశారు.
 
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం కొట్టేసిన ఆయన అభిమాని డైరెక్టర్ బాబీ కూడా తన కల నిజమైన వేళ అంటూ రిప్లయ్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించడం తన చిన్నప్పటి కోరిక అని చెప్పుకొచ్చారు డైరెక్టర్ బాబీ. మెగాస్టార్‌తో సినిమా చేయడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు బాబీ వెల్లడించారు.  దీనికి చిరు థ్యాంక్స్ అంటూ రీట్వీట్ చేశారు.