శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (09:29 IST)

అంగరంగ వైభవంగా వివాహం... జొన్నలగడ్డ ఇంటి కోడలిగా మారిన నిహారిక

మెగా ఫ్యామిలీ ఇంటా బాజభజంత్రీలు మోగాయి. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని చారిత్రక ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఈ పెళ్లి జరిగింది. ఈ వివాహ ఘట్టానికి మెగా ఫ్యామిలీతో పాటు.. కేవలం అతికొద్ది మంది ఆహ్వానితులు మాత్రమే వచ్చారు. 
 
నిహారికను గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు కుమార్తె చైతన్య జొన్నలగడ్డకు ఇచ్చి మెగా బ్రదర్స్ పెళ్లి చేశారు. ఈ పెళ్లి ముహూర్తం బుధవారం ఉదయం ముగిసింది. కుటుంబ సభ్యుల సమక్షంలో నిహారిక కొద్ది సేపటి క్రితం జొన్నలగడ్డ చైతన్యతో ఏడడుగులు వేసింది. జొన్నలగడ్డ కుటుంబ కోడలిగా మారిపోయింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌విలాస్‌ ప్యాలెస్‌లో ఈ వివాహం వైభవంగా జరిగింది.
 
ఈ నేపథ్యంలో నాగబాబు భావోద్వేగానికి లోనయ్యారు. ట్విటర్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. 'తను స్కూలుకు వెళ్లిన మొదటి రోజు నాకింకా గుర్తుంది. నా చిన్నారి కూతురు స్కూలుకు వెళ్లేంత పెద్దదై పోయిందనే నిజం నమ్మడానికే నాకు చాలా ఏళ్లు పట్టింది. ఈసారి ఇంకెన్నాళ్లు పడుతుందో.. కాలమే నిర్ణయిస్తుంద'ని నాగబాబు ట్వీట్ చేశారు.