ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 డిశెంబరు 2020 (12:05 IST)

మా చేతుల్లో పెరిగిన నిహారికను చైతన్య చేతుల్లో పెడుతున్నాం : చిరంజీవి

మెగా బ్రదర్ నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక. ఈమెకు బుధవారం పెళ్లి జరుగనుంది. గుంటూరుకు చెందిన ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డకు ఇచ్చి వివాహం చేయనున్నారు. ఈ వివాహం రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరుగనుంది.
 
ఇందుకోసం మెగా ఫ్యామిలీతో పాటు.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరోలు అల్లు అర్జున్, అల్లు శిరీష్‌లు ప్రత్యేక విమానాల్లో రాజస్థాన్‌కు చేరుకున్నారు. ఈ వివాహ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి నుంచి వివిధ రకాల వేడుకలు జరుగుతున్నాయి. ఇదిలావుంటే, నిహారిక పెళ్లి నేపథ్యంలో మెగా ఫ్యామిలీ నిహారికతో దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
 
తాజాగా, మెగాస్టార్ చిరంజీవి కూడా నిహారికతో కలిసి ఫొటో దిగి పోస్టు చేశారు. తనతో చిన్నప్పుడు నిహారిక దిగిన ఫొటోలను కూడా ఆయన పోస్ట్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఎత్తుకుని ఆయన అప్పట్లో ఈ ఫొటో దిగారు. 'మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు, ఆశీస్సులు' అని చిరు పేర్కొన్నారు.