ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 జులై 2021 (11:47 IST)

మెగా డాటర్ ఇలా మారిందేంటి?

మెగా డాటర్ నిహారిక ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని ఉదయ్ విలాస్ వేదికగా చైతన్య అనే వ్యక్తితో నిహారిక వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత నిహారికలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నిహారిక అప్పుడప్పుడు తన భర్తతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్స్‌ని అలరిస్తూ ఉంటుంది. 
 
ప్రస్తుతం తన భర్తతో కలిసి హాలీడేస్‌లో భాగంగా పాండిచ్చేరి వెళ్లింది. అక్కడ తన భర్తతో దిగిన ఫొటోలు షేర్ చేయగా, ఇందులో నిహారిక న్యూలుక్ చూసి స్టన్ అవుతున్నారు. ఈ అమ్మడు ఇలా మారిందేంటి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. నిహారిక త్వరలో వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులని పలకరించనున్న విషయం తెలిసిందే. ఇందులో అనసూయ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.