గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 5 సెప్టెంబరు 2022 (17:27 IST)

క్రైమ్ & లవ్ స్టోరీగా నీకై నేను

neekai nenu
neekai nenu
NGSP క్రియేషన్స్ పతాకంపై శ్రీజిత్ వడ్డి, క్రిష్ కురుప్, అజయ్, రాజీవ్ కనకాల నటీ నటులుగా కృష్ణ కుమార్ అసూరి దర్శకత్వంలో నాగిరెడ్డి తారక ప్రభు, ఏ. హనీఫ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "నీకై నేను".ఈ చిత్ర ప్రారంభోత్సవం  కార్యక్రమాలు  హైదరాబాద్  రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన  ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్  హీరో హీరోయిన్ లపై చిత్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా, ప్రముఖ సినిమాటో గ్రాఫర్ యస్. గోపాల్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. 
 
అనంతరం చిత్ర దర్శకుడు కృష్ణ కుమార్ అసూరి మాట్లాడుతూ.." మా గురువుగారు డిస్నీ ఛైర్మెన్ ఎలన్ హార్న్, మరియు గుహగార్ల ప్రోత్సాహంతో నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. మొదట ప్రభాస్ నటించిన  రాదేశ్యామ్ సినిమా స్క్రిప్ట్ డెవలప్మెంట్ లో కొంత వర్క్ చేశాను. ఆ తరువాత నేను ప్రిపేర్ చేసుకొన్న ఈ కథను నిర్మాతలకు చెప్పగానే వారికి నచ్చి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. ఇక కథ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గరలో ఉండే ఘాట్ రోడ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న క్రైమ్, లవ్ స్టోరీ "నీకై  నేను". ఈ చిత్రాన్ని సింగల్ షెడ్యూల్ లో పూర్తి చేసుకొని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదములు" అన్నారు.
 
నిర్మాత నాగిరెడ్డి తారక ప్రభు మాట్లాడుతూ.." కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్న నాకు సినిమా నిర్మాణం పట్ల  ఇంట్రెస్ట్ ఉంది. అయితే మంచి సినిమా తీద్దాం అనుకుంటున్న  టైమ్ లో నాకు ఘాట్ రోడ్ నే పథ్యంలోని క్రైమ్ లవ్ స్టోరీని దర్శకుడు కృష్ణ గారు చెప్పగానే  చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించి వెంటనే  సినిమా స్టార్ట్ చేశాం.  ఈ నెల 15 నుండి రెగ్యులర్ షూట్ మునార్ లో జరుగుతుంది.ఈ సినిమాకు మంచి నటీ నటులతో పాటు మంచి టెక్నిషియకన్స్ దొరికారు.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను సింగల్ షెడ్యూల్ లో పూర్తి చేసి డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్లాన్ చేస్తున్నాము " అన్నారు.
 
చిత్ర హీరోయిన్ క్రిష కురుప్ మాట్లాడుతూ.. "నా జర్నీ తమిళ్ మూవీ "అలగై కుట్టి చెళ్ళం" తో స్టార్ట్ అయింది. ఆ తరువాత మిల్టేన్ సర్ తో "గోళీ సోడా 2", జ్యోతి సినిమాలలో నటించిన నేను తెలుగులో రీసెంట్ గా అది పినిశెట్టి గారితో  "క్లాప్" సినిమా చేశాను. ఆ సినిమా తరువాత నేను తెలుగులో చేస్తున్న రెండవ సినిమా "నీకై నేను". కృష్ణ గారు చెప్పిన ఈ కథ చాలా ఇంట్రెస్ట్ తో పాటు క్యూరియాసిటీ గా చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఇందులో నేను పల్లవి పాత్రలో నటిస్తున్నాను. మంచి స్క్రిప్ట్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది.ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు  ధన్యవాదాలు "- అన్నారు.
 
హీరో శ్రీ జిత్ వడ్డి మాట్లాడుతూ..  " సినిమా మీద ప్యాషన్ తో ఇండస్ట్రీ కి రావడం జరిగింది.ఇది నా మొదటి చిత్రం.ఇందులో నేను నాని పాత్రలో నటిస్తున్నాను. నాకిచ్చిన పాత్రకు నేను 100% న్యాయం చేయాడనికి ప్రయత్నిస్తాను. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు  ధన్యవాదాలు " అన్నారు.
 
నటీ నటులు
శ్రీజిత్ వడ్డి, క్రిష కురుప్, అజయ్, రాజీవ్ కనకాల,రాజీవ్ పిళ్ళయ్, జయప్రకాశ్, అశ్రీత, శైలజ ప్రియ, మేక రామకృష్ణ, మహేష్ తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ :NGSP క్రియేషన్స్
నిర్మాతలు : నాగిరెడ్డి తారక ప్రభు, ఏ. హనీఫ్
ఎగ్జిగ్యూటివ్  ప్రొడ్యూసర్స్ : సి. భాస్కరరాజు, ఉదయ్ కుమార్
కథ, కథనం,రైటర్ &డైరెక్టర్ : కృష్ణ కుమార్ అసూరి
సంగీతం :  మెగా కోటి
డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ : వాసు.పి
ఎడిటర్‌ : ఎస్ ఏం. చంద్రశేఖర్
పి ఆర్. ఓ : మూర్తి మల్లాల
ఆర్ట్ డైరెక్టర్ : రోషన్
లిరిక్ రైటర్స్ : కె కె. సత్యమూర్తి
వి యఫ్. ఎక్స్ : టీమ్ మయిన్
ఎడిషనల్ స్టోరీ & కో డైరెక్టర్ : జనగం శ్రీనివాసరావు
ఎడిషనల్ డైలాగ్ రైటర్స్ : సంఘీర్, రాజేష్, నరేష్
స్క్రిప్ట్ కో ఆర్డినేటర్ : రమేష్ ఇందాల
స్టిల్స్ : గణేష్
క్యాస్టుమ్స్ : మోహన్
మేకప్ : శివ
ప్రొడక్షన్ ఎగ్జి క్యూటివ్ : ఆర్. వి. రామకృష్ణ