శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2017 (20:37 IST)

నాని హీరోగా డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం పేరు 'నిన్ను కోరి'

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.3గా నిర్మిస్తున్న చిత్రం పేరు 'నిన్ను కోరి'. ఫిబ్రవరి 24 హీరో నాని పుట్టినరోజు

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్మాణ దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.3గా నిర్మిస్తున్న చిత్రం పేరు 'నిన్ను కోరి'. ఫిబ్రవరి 24 హీరో నాని పుట్టినరోజు సందర్భంగా నిర్మాత డి.వి.వి. దానయ్య నానికి బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ 'నిన్ను కోరి' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
 
ప్రస్తుతం అమెరికాలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ జరుగుతోంది. మార్చి 10 వరకు అమెరికా షెడ్యూల్‌ వుంటుంది. తర్వాత వైజాగ్‌లో జరిగే షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. నేచురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, పృథ్వీ, రాజశ్రీ నాయర్‌, నీతు, భూపాల్‌ రాజ్‌, కేదార్‌ శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.