గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 మార్చి 2021 (11:16 IST)

కార్తీక్ దీపం డాక్టర్ బాబుపై ట్రోలింగ్.. వంటలక్కను గౌరవించండి.. తర్వాత..?

తెలుగు బుల్లితెరపై గత కొన్ని నెలలుగా టాప్1 సీరియల్‌గా కొనసాగుతోంది కార్తీక దీపం. ఈ సీరియల్ హీరో డాక్టర్ బాబు కార్తీక్ (పరిటాల నిరుమ్)పై ప్రస్తుతం ట్రోలింగ్ మొదలెట్టారు నెటిజన్లు. విమెన్స్ సందర్భంగా పలువురు ప్రముఖులు మహిళలకు శుభాకాంక్షలు వెల్లడించారు. 
 
ఈ క్రమంలో నిరుపమ్ కూడా ఓ వీడియో మెసేజ్ ఇచ్చారు. "మేం ఎంత వేధించినా మీరు ప్రేమిస్తారు. మేము మోసం చేస్తాము. అయినా సరే ఎంతో ఓపిగ్గా భరిస్తారు. ఎంతో సహనంతో మమ్మల్ని మార్చుకుంటారు. మార్పు మాలో రావాలి. మీకు మరింత గౌరవం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్లందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు" అని సందేశం ఇచ్చారు.
 
అయితే నిరుపమ్ ఇచ్చిన సందేశం మంచిదే అయినప్పటికీ.. నెటిజన్లకు నచ్చలేదు. ఎందుకంటే అతడు నటిస్తోన్న కార్తీక దీపం సీరియల్‌లో అనుమానంతో కట్టుకున్న భార్య దీపను కష్టాల పాలు చేస్తుంటాడు కార్తీక్. దీంతో నెటిజన్లు నిరుపమ్‌ని ట్రోల్ చేస్తున్నారు. 
 
అదంతా కాదు ముందు కార్తీక దీపం సీరియల్‌లో మీరు వంటలక్కను గౌరవించండి అని కొందరు కామెంట్ పెట్టగా.. సర్ అందులో మీ పాత్రను దిగజారుస్తున్నారు. ముందు ఆ సీరియల్ మానేయండి అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఒక్క వంటలక్కకు తప్ప అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.