పెళ్లి ప్లాన్ వెల్లడించగానే నిర్మాతలు ముఖం చాటేశారు... అందుకే ఆఫర్లు లేవు : సమంత
హీరో నాగార్జునకు కాబోయే కోడలు.. ఆమెతో ఆ విధంగా ఎలా ప్రవర్తించగలమని నిర్మాతలు అంటున్నారనీ సినీ నటి సమంత చెప్పుకొచ్చింది. అందుకే గత యేడాదిగా తనకు సినీ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయానని ఆమె వాపోయింది.
హీరో నాగార్జునకు కాబోయే కోడలు.. ఆమెతో ఆ విధంగా ఎలా ప్రవర్తించగలమని నిర్మాతలు అంటున్నారనీ సినీ నటి సమంత చెప్పుకొచ్చింది. అందుకే గత యేడాదిగా తనకు సినీ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయానని ఆమె వాపోయింది.
సమంత ఓ ఆంగ్ల పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నట్టు తాను ఓ మాట చెప్పగానే తనకు సినీ ఆఫర్లు పూర్తిగా తగ్గిపోయానని తెలిపింది పైగా.. తాను చైతూను పెళ్లి చేసుకున్నప్పటికీ.. సినిమాల్లో నటించేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదనీ తేల్చి చెప్పింది.
తన పెళ్లి విషయం ప్రకటించగానే ఆఫర్స్ రావడం తగ్గిపోయిందని, సంవత్సరం పాటు హిట్ సినిమాలు ఇచ్చానని, అయినా నిర్మాతలు ఇప్పుడు వెనుకంజ వేస్తున్నారని సమంత చెప్పింది. నా తమిళ మూవీ '24', 'అ..ఆ', 'జనతా గ్యారేజ్' వంటి తెలుగు సినిమాలు హిట్ కాలేదా అని ఆమె ప్రశ్నించింది.
స్టార్ హీరో నాగార్జున కోడలు ఆమె..అలాంటిది ఆమెతో ఎలా పని చేస్తామని ప్రొడ్యూసర్లు అంటున్నారని, కానీ పెళ్ళయ్యాక కూడా నటించడానికి తనకు అభ్యంతరం లేదని పేర్కొంది. నాగ చైతన్య కూడా తనకు ఎంతో సపోర్ట్ చేస్తున్నాడని సమంత వెల్లడించింది. సినీ ఆఫర్లేకాదు.. యాడ్ ఆఫర్లు కూడా రావడంలేదని సమంత వాపోయింది.