1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 2 మే 2025 (21:05 IST)

Aghori లేడీ కాదు, అవాక్కయ్యారా? చంచల్ గూడ జైలుకి అఘోరి శ్రీనివాస్

lady aghori nagasadhu
Lady Agori కాదు Aghori Srinivas, మొన్నటివరకూ తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తూ తిరిగిన అఘోరీ లేడీ అనుకున్నారు అంతా. కానీ లేడీ అఘోరి కాదు అఘోరి శ్రీనివాస్ అని తేల్చారు చివరికి. ఇక అసలు విషయానికి వస్తే... సినిమా నిర్మాత వద్ద డబ్బులు తీసుకుని మోసగించారనే ఫిర్యాదుపైన అఘోరి శ్రీనివాస్ పైన మోకిల పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
 
విచారణలో భాగంగా శుక్రవారం నాడు మరోసారి షాద్ నగర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ముందు అఘోరి శ్రీనివాస్ ను ప్రవేశపెట్టారు. కేసు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి అఘోరి శ్రీనివాస్ కు మరో 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. పోలీసులు అఘోరిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో అఘోరీతో మాట్లాడేందుకు పలు మీడియా ఛానళ్ల వారు ఎగబడ్డారు. పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకుని అఘోరీని పోలీసు వాహనం ఎక్కించుకుని వెళ్లిపోయారు.