శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2017 (16:09 IST)

#NTR28 ప్రారంభం.. క్లాప్ కొట్టి కూర్చుండిపోయిన పవన్.. నవ్వాపుకోలేకపోయిన ఎన్టీఆర్ (వీడియో)

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందించే సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం సోమవారం హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందించే సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం సోమవారం హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పవన్ క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  
 
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2018 జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ కెరీర్లో ఈ సినిమా 28వది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్న త్రివిక్రమ్, అజ్ఞాతవాసి అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ సినిమా పనులు ప్రారంభించనున్నాడు.
 
కాగా.. పూజా కార్యక్రమం తర్వాత సినిమాకు పవన్‌ తొలి క్లాప్‌ కొట్టారు. అయితే క్లాప్‌ కొట్టేటప్పుడు నాకివన్నీ భయం అన్నారు. చేతులు వణుకుతున్నాయ్ అన్నారు. క్లాప్ కొడుతూ ఏం చెప్పాలి.. అని పవన్ అడిగిన ప్రశ్నకు తారక్‌తో పాటు అక్కడున్నవారంతా గొల్లున నవ్వారు. ఆ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ తారక్ దండం పెట్టుకుంటాడు. ఆయన కెమెరా స్విచ్ఛాన్ చేస్తాడని చెప్తుంటే ఇందుకు పవన్ దాక్కోవాలా అని సెటైర్ వేశారు.  
 
క్లాప్‌ కొట్టిన తర్వాత తారక్‌ దేవుడికి దండం పెట్టుకోవాలి. అప్పుడు "నేను ఏ వైపు తిరిగి దండం పెట్టాలి. లుక్‌ ఇటా అటా" అంటూ తారక్‌ వేసిన ఫన్నీ ప్రశ్నలు నవ్వులు పూయించాయి. పవన్‌ క్లాప్‌ కొట్టిన తర్వాత క్లాప్‌ బోర్డు పక్కకు తీసేయాలి. కానీ ఆ సమయంలో పవన్‌కు ఏం చేయాలో అర్థంకాక క్లాప్‌ కొట్టి కింద కూర్చుండిపోయారు. తారక్‌ వెనక్కి తిరిగి చూసేసరికి పవన్‌ కూర్చుని కన్పించడంతో ఆయన నవ్వాపుకోలేకపోయారు. 
 
ఆ తర్వాత గ్రూప్‌ ఫొటో దిగుతుండగా తారక్‌ పవన్‌ను మధ్యలో నిలబడమన్నారు. కానీ పవన్‌ తారక్‌నే నిలబడాల్సిందిగా బలవంత పెట్టారు. అలా పంచ్‌లు, సెటైర్లతో ఎన్టీఆర్ సినిమా పూజా కార్యక్రమం సరదాగా సాగిపోయింది. ఈ కార్యక్రమంలో తారక్‌తో పాటు ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, తనయుడు అభయ్‌రామ్‌ కూడా పాల్గొని సందడి చేశారు. హారికా-హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఎస్‌.రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు.