ఈరోజ్ బ్యానర్‌పై థ్రిల్లర్ మూవీలో జర్నలిస్టుగా కనిపించనున్న నయనతార..
దక్షిణాది హీరోయిన్ నయనతార ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉంది. ఆమెకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఐదు ప్రాజెక్టులు ఉండగా, తాజాగా మరో ప్రాజెక్ట్‌కి సైన్ చేసింది నయనతార. తాజాగా యువహీరో శివకార్త
దక్షిణాది హీరోయిన్ నయనతార ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉంది. ఆమెకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఐదు ప్రాజెక్టులు ఉండగా, తాజాగా మరో ప్రాజెక్ట్‌కి సైన్ చేసింది నయనతార. తాజాగా యువహీరో శివకార్తికేయన్- మోహన్ రాజన్ ఫిలింలో ప్రాజెక్ట్‌లోను నటిస్తోంది. ఇక ఈరోజ్ ఇంటర్నేనల్ సంస్థ నిర్మించనున్న రియలిస్టిక్ థ్రిల్లర్‌లోను నయనతార కథానాయికగా ఎంపికైంది.
ఈ చిత్రాన్ని మిస్కిన్ మూవీకి సౌండ్ ఇంజినీర్‌గా పనిచేసిన భరత్ కృష్ణమాచారి తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాను విదేశాల్లో చిత్రీకరించనున్నారు. నయనతార ఈ మూవీలో జర్నలిస్ట్‌గా కనిపించనుందని తెలుస్తోంది. తన ఐడెంటిటీ, ఫ్యామిలీ కోసం నయనతార పలు దేశాలు తిరుగుతూ చివరికి తమిళనాడుకి చేరుకుంటుందట. ఫీమేల్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రం అభిమానులను అలరించనుందని సమాచారం.