మంగళవారం, 29 ఏప్రియల్ 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (16:21 IST)

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

cinnamon
దాల్చిన చెక్క. వంటింటి దినుసుల్లో దీని పాత్ర కీలకం. కూరల్లో దీనిని బాగా ఉపయోగిస్తారు. దాల్చిన చెక్కతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
దాల్చిన చెక్క గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం అడ్డుకుని మేలు చేస్తుంది.
దాల్చిన చెక్క కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది, ఫలితంగా గుండెపోటు నివారించబడుతుంది.
ఆస్తమా లేదా శ్వాసకోశ వ్యాధులకు కూడా దాల్చినచెక్క మేలు చేస్తుంది.
దాల్చిన చెక్కను తింటుంటే కేశాలు పొడవుగానూ, మందంగానూ పెరుగుతాయి.
దాల్చిన చెక్క ఆర్థరైటిస్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది.
పీరియడ్స్ పెయిన్ సమస్యను దూరం చేసుకోవడానికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
దాల్చిన చెక్కను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మ సంబంధిత వ్యాధుల నివారణలో మేలు జరుగుతుంది.