శనివారం, 14 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 10 ఆగస్టు 2024 (15:15 IST)

తొలి రోజున రూ. 1.63 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించిన నిహారిక కొణిదెల కమిటీ కుర్రోళ్ళు

kamtity collections
kamtity collections
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మంచి ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణంలో స్నేహం, ప్రేమ‌, కుటుంబంలోని భావోద్వేగాల‌ను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో చ‌క్క‌గా తెర‌కెక్కించార‌ని అంద‌రూ ప్ర‌శంసిచారు. 
 
ప్ర‌శంస‌ల‌తో పాటు సినిమాకు మంచి క‌లెక్ష‌న్స్  కూడా వ‌చ్చాయి. వ‌ర‌ల్డ్ వైడ్ ఈ చిత్రం తొలి రోజున రూ.1.63 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని అభినందిస్తూ ప్రేక్ష‌కులు సినిమాను ఆద‌రించార‌ని ..ఇక వీకెండ్స్ అయిన‌ శ‌నివారం, ఆదివారం రోజుల్లో ఈ క‌లెక్ష‌న్స్ మ‌రింత పెరుగుతాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి.