శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (15:23 IST)

'జూలీ 2' ఓ అడల్ట్ చిత్రం... సీన్లకు సెన్సార్ నో కట్స్..!

టాలీవుడ్ హీరోయిన్ లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం 'జూలీ 2'. ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఇందులో లక్ష్మీ రాయ్ తన అందాల ఆరబోతతో అదరగొట్టింది. ఈ ట్రైలర్‌ను చూడగానే ప్రేక్షకుల

టాలీవుడ్ హీరోయిన్ లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం 'జూలీ 2'. ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఇందులో లక్ష్మీ రాయ్ తన అందాల ఆరబోతతో అదరగొట్టింది. ఈ ట్రైలర్‌ను చూడగానే ప్రేక్షకులకు దిమ్మతిరిగిపోయింది. అలాంటి చిత్రానికి సెన్సార్ బోర్డు ఎలాంటి కత్తెరలు వేయకుండా "ఎ" సర్టిఫికేట్‌ను మంజూరు చేసింది. 
 
దీంతో సెన్సార్ బోర్డ్ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో ఎవరికీ అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఒక్కో సినిమా విషయంలో చాలా కఠినంగా వ్యవహిరంచే సెన్సార్ సభ్యులు కొన్ని సినిమాల విషయంలో మాత్రం చూసి చూడనట్టుగా వెళ్లిపోయారనే విమర్శలు వస్తున్నాయి. అనూహ్యంగా బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన 'జూలీ 2' సినిమాకు ఎలాంటి కట్స్ సూచించకుండా సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చి తేరుకోలేని షాకిచ్చింది.