శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 మార్చి 2017 (17:57 IST)

'జూలీ కోసం తొలిసారి బికినీ వేశా.. అందాలు ఆరబోశా'నంటున్న హీరోయిన్

లక్ష్మీ రాయ్ అలియాస్ రాయ్ లక్ష్మీ... మెగాస్టార్ చిరంజీవి సరసన 'ఖైదీ నంబర్ 150'వ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్‌లో నర్తించింది. ఈ చిత్రంలో ఆమె నటించిన 'రత్తాలు.. రత్తాలు' పాట సూపర్ డూపర్ హిట్ అయింది. ఇపుడు మరోమ

లక్ష్మీ రాయ్ అలియాస్ రాయ్ లక్ష్మీ... మెగాస్టార్ చిరంజీవి సరసన 'ఖైదీ నంబర్ 150'వ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్‌లో నర్తించింది. ఈ చిత్రంలో ఆమె నటించిన 'రత్తాలు.. రత్తాలు' పాట సూపర్ డూపర్ హిట్ అయింది. ఇపుడు మరోమారు తన అందచందాలను ఆరబోసేందుకు సిద్ధమైంది. 
 
బాలీవుడ్ సినిమా ‘జూలీ 2’ చిత్రంలో ఈ భామ బికినీలో రెచ్చిపోయిందట. తాజాగా బికినీతో ఉన్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. తన ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. ‘జూలీ 2 సినిమా కోసం తొలిసారి బికినీ వేశాను.. అందాలను ఆరబోశాను’ అంటూ అందులో కామెంట్స్ చేసింది. 
 
తొలుత హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైన లక్ష్మీరాయ్‌కి కెరీర్ ఆరంభంలోనే వైఫల్యాలు చుట్టుముట్టాయి. దీంతో అవకాశాలు సన్నగిల్లడంతో ఐటెం సాంగ్స్ వైపు మొగ్గుచూపింది. పవన్ కల్యాణ్, చిరంజీవి పక్కన ఐటెం సాంగ్స్ చేయడంతో మళ్లీ ఈ భామ కెరీర్ గాడిన పడింది.