శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2017 (17:30 IST)

జూలీ2 ట్రైలర్.. రాయ్ లక్ష్మీ అందాలు అదుర్స్.. వీడియో చూడండి

ఖైదీ నెం.150లో మెగాస్టార్ చిరంజీవితో రత్తాలు పాటకు స్టెప్పులేసిన.. ఐటమ్ గర్ల్ రాయ్ లక్ష్మి ప్రస్తుతం బాలీవుడ్‌లో మకాం వేసింది. దీపక్ శివదాసని దర్శక నిర్మాణంలో తెరకెక్కుతున్న జూలీ-2లో రాయ్ లక్ష్మి టైటి

ఖైదీ నెం.150లో మెగాస్టార్ చిరంజీవితో రత్తాలు పాటకు స్టెప్పులేసిన.. ఐటమ్ గర్ల్ రాయ్ లక్ష్మి ప్రస్తుతం బాలీవుడ్‌లో మకాం వేసింది. దీపక్ శివదాసని దర్శక నిర్మాణంలో తెరకెక్కుతున్న జూలీ-2లో రాయ్ లక్ష్మి టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించివ థియేట్రికల్ ట్రైలర్‌‌ను తాజాగా విడుదల చేశారు.
 
ఇటీవల విడుదలైన టీజర్‌తో కుర్రకారును ఆకట్టుకున్న రాయ్ లక్ష్మి,  తాజాగా విడుదలైన ట్రైలర్‌తో అందాలను బాగానే ఆరబోసింది. నేహా ధూపియా టాప్ సీన్లు చేసిన జూలీ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న జూలీ-2లో మరింత బోల్డ్‌గా నటించి బాలీవుడ్ జనాలను ఆకట్టుకునేందుకు రాయ్ లక్ష్మి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. 
 
బాలీవుడ్‌, అండర్‌వరల్డ్, పాలిటిక్స్‌లోని చీకటి కోణాలను బయటపెట్టేలా ఈ చిత్రం వుంటుందని ఇప్పటికే సినీ యూనిట్ ప్రకటించిన నేపథ్యంలో ఇందులో రాయ్ లక్ష్మీ అందాల ఆరబోతకు ఎలాంటి హద్దులు వుండవని సినీ జనం అంటున్నారు. 
 
ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా టీజర్లో అందాలతో కుర్రకారును హీటెక్కించిన ఈ ముద్దుగుమ్మ.. ట్రైలర్‌లోనూ అదరగొట్టేసింది. ఇకపోతే.. ఈ సినిమాలో రితి అగ్నిహోత్రి, ఆదిత్య శ్రీవాత్సవ, రవికిషన్, పంకజ్ త్రిపాఠీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 6న సినిమా రిలీజ్‌కు రంగం సిద్ధం అవుతుంది.