సంబంధిత వార్తలు
- హాలీవుడ్‌ను తలపిస్తున్న 'టిక్... టిక్... టిక్' (Teaser)
- సుచీలీక్స్ : సోషల్ మీడియాలో నివేద పేతురాజ్ రాసలీల వీడియో
- పదో తరగతి పరీక్షల సమయంలో సినిమా విడుదల: నిర్మాతకు ఎన్ని గట్స్ ఉండాలి
- 'జై' రఫ్ అయితే.. 'లవ' అంత సాఫ్ట్ : జూ.ఎన్టీఆర్ "జై లవ కుశ" టీజర్
- బాలకృష్ణ 'పైసావసూల్' దూకుడు.. ''పదామరి'' సాంగ్ రిలీజ్ (Video)
'పెళ్లి చూపులు' డైరెక్టర్ తాజా చిత్రం ''మెంటల్ మదిలో'' (Trailer)
యువ కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా 'పెళ్లి చూపులు' నిర్మాత రాజ్ కందుకూరి నిర్మిస్తున్న తాజా చిత్రం మెంటల్ మదిలో (మనవి ఆలకించరాదటె! అనేది ట్యాగ్ లైన్). ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు
యువ కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా 'పెళ్లి చూపులు' నిర్మాత రాజ్ కందుకూరి నిర్మిస్తున్న తాజా చిత్రం మెంటల్ మదిలో (మనవి ఆలకించరాదటె! అనేది ట్యాగ్ లైన్). ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా ద్వారా 'నివేతా పేతురాజ్' కథానాయికగా తెలుగు వెండితెరకు పరిచయమవుతోంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు విడుదల చేశారు.
నాయకా నాయికల మధ్య ప్రేమ .. ఘర్షణకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. ట్రైలర్ ద్వారా కంటెంట్‌ను చెబుతూనే ఆసక్తిని రేకెత్తించారు. యూత్‌కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందనే విషయం ఈ ట్రైలర్‌తో అర్థమైపోతోంది. త్వరలోనే ఆడియోను రిలీజ్ చేసి .. అదే రోజున సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని నిర్మాత వెల్లడించారు.
