మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 4 మే 2016 (13:32 IST)

పనామా పేపర్స్ : అజయ్ దేవగన్‌కు విదేశీ షేర్లు... భార్య కజోల్ కూడా భాగస్వామినేనా?

ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపిన పనామా పేపర్స్‌లో తాజాగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, ఆయన భార్య కజోల్ పేర్లు కూడా తాజాగా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా అజయ్‌కు విదేశీ ఖాతాలు ఉన్నట్టు ఆరో విడతగా వెల్లడైన పత్రాల ద్వారా వెల్లడైంది. బ్రిటీష్ వర్జిన్ దీవులకు చెందిన మేర్లీబోన్ ఎంటర్‌టైన్మెంట్ కంపెనీలో అజయ్ వెయ్యి షేర్లను కొన్నట్లు పనామా పత్రాల వెల్లడిలో బహిర్గతమైంది. ఈ కంపెనీకి మోసాక్ ఫొనెస్కా రిజిస్టర్ ఏజెంట్‌గా ఉంది. నైసా యుగ్ ఎంటర్‌టైన్మెంట్ కంపెనీ పేరుతో అజయ్ విదేశీ కంపెనీ షేర్లను కొన్నారు. 
 
ఆ కంపెనీలో ఆయన భార్య కజోల్ కూడా భాగస్వామిగా ఉన్నారు. దీంతో కాజోల్ కూడా విదేశీ ఖాతాలు ఉన్నారనే సందేహం ఉత్పన్నమవుతోంది. మరోవైపు.. 2013లో ఆ కంపెనీకి అజయ్ డైరక్టర్‌గా వ్యవహరించి, 2014లో వైదొలిగారు. దీనిపై అజయ్ దేవగన్ స్పందిస్తూ... ఆర్‌బీఐ నియమావళి ప్రకారమే విదేశీ పెట్టుబడులు పెట్టినట్లు స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ అమితాబ్, ఐశ్వర్యరాయ్‌లకు కూడా విదేశీ అకౌంట్లున్న విషయం తెలిసిందే.