బుర‌ద‌లోనే రెండురోజులున్న‌ ప‌రిణితి చోప్రా

Parinithi Chopra
ముర‌ళీకృష్ణ‌| Last Updated: గురువారం, 10 జూన్ 2021 (16:29 IST)
Parinithi Chopra
విభిన్న‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తుంది బాలీవుడ్ న‌టి
ప‌రిణితి చోప్రా. లేటెస్ట్‌గా నైనా సెహ్‌వాల్ బాట్మింట‌న్
క్రీడాకారిణి బ‌యోపిక్‌లో న‌టిస్తోంది. ఇందుకు సంబంధించిన ఆట‌లో శిక్ష‌ణ‌కూడా తీసుకుంది. ఏ పాత్ర అయినా త‌ప్ప‌నిస‌రిగా క‌ష్ట‌ప‌డాల్సిందే అంటోంది. ఇదే సంవ‌త్స‌రంలో ఆమె చేసిన `సందీప్ ఔర్ పింకీ ప‌రార్` మూవీ గురించి ఆస‌క్తి విష‌యాల‌ను అభిమానుల‌తో పంచుకుంది. త‌న సోష‌ల్‌మీడియాలో బీచ్‌లో కూర్చుని త‌దేకంగా ఆకాశం వంక చూస్తున్న ఆమెకు గ‌తంలో జ‌రిగిన షూటింగ్ ముచ్చ‌ట్లు మ‌దిలో మెదిలాయ‌ట‌.

అర్జున్ క‌పూర్‌తో న‌టించిన సినిమా `సందీప్ ఔర్ పింకీ ప‌రార్`. ఇది అమెజాన్ ప్రైమ్‌లో ఇటీవ‌లే విడుద‌లైంది. ఇందులో ప‌క్కా కొండ ప్రాంత అమ్మాయిగా న‌టించాల్సివ‌చ్చింది. షూటింగ్ చేసే ప్రాంతంలో అంతా మురికిగా వుండేది. బుర‌ద‌గానూ వుండేది. మేక‌ప్ స‌రిగ్గా లేదు. నాచుర‌ల్‌గా వుండేలా ద‌ర్శ‌కుడు పాత్ర‌ను మ‌లిచాడు. అయితే అక్క‌డ బుర‌ద‌లో ఎక్కువ‌గా వుండ‌డంలో అక్క‌డే ఓ గుడిసెలో రాత్రి నిద్ర‌పోవాల్సి వ‌చ్చింది. అందుకే మురికిగానే రెండురోజులు స్నానం చేయ‌కుండా వున్నానంటోది. అయితే దీనికి ఓ కార‌ణ‌ముంది. ఆ మూవీలో వుండ‌గానే అనుకోనివిధంగా గ‌ర్భ‌విచ్చితి జ‌ర‌గ‌డంతో ఆమె షాక్‌కు గుర‌యింది. అందుకే ఆ మూడ్‌లోనుంచి రావ‌డానికి టైం ప‌ట్టింది. అదే నేచుర‌ల్‌గా వుంద‌ని ద‌ర్శ‌కుడు అలా తెర‌కెక్కించాడు. అందుకు ఆమెకూడా స‌హ‌క‌రించింది.దీనిపై మరింత చదవండి :