ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2016 (09:30 IST)

పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా 'అ.. ఆ...' చిత్ర ఆడియో .. మే 2న రిలీజ్

మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నితిన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ''అ.. ఆ''. నితిన్‌కి జంటగా సమంత నటిస్తోంది. ఎప్పటినుంచో అనుకుంటున్న 'అ.. ఆ' సినిమా ఆడియో ఫంక్షన్ డేట్ ఖరారైంది. ఈ ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు సినిమా హీరో నితిన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 
 
మే 2వ తేదీ శిల్పకళావేదికలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరుగనుంది. కొద్ది రోజుల క్రితం 'అ.. ఆ' సినిమా షూటింగ్ జరుగుతున్న సెట్‌కు వెళ్లి నితిన్‌ను ఆశ్చర్యపరిచారు పవర్ స్టార్. ఆయన ముందు నటించడం చాలా ఆనందాన్నిచ్చిందని, ఆ సందర్భంలో చాలా నెర్వస్గా ఫీలయ్యానని ఈ సందర్భంగా నితిన్ ట్వీట్ చేశాడు. పవన్‌కు త్రివిక్రమ్‌తో ఉన్న క్లోజ్ సంబంధం ఎలాంటిదో అందరికి తెలసిందే. దర్శకుడు త్రివిక్రమ్‌తో పాటు.. హీరో నితిన్‌తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మే నెలలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.