గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 27 జులై 2017 (17:24 IST)

ముగ్గురు పిల్లలతో బల్గేరియాలో స్టార్ హీరో జాలీ ట్రిప్‌...

టాలీవుడ్‌కు చెందిన ఆ హీరోకు మూడు పెళ్లిళ్లు. ఇందులో ఇద్దరు భార్యలు విడాకులు తీసుకున్నారు. ఇపుడు విదేశీ భామతో దాంపత్య జీవితం కొనసాగిస్తున్నారు. అయితే, రెండో భార్య, మూడో భార్యకు జన్మించిన ముగ్గురు పిల్ల

టాలీవుడ్‌కు చెందిన ఆ హీరోకు మూడు పెళ్లిళ్లు. ఇందులో ఇద్దరు భార్యలు విడాకులు తీసుకున్నారు. ఇపుడు విదేశీ భామతో దాంపత్య జీవితం కొనసాగిస్తున్నారు. అయితే, రెండో భార్య, మూడో భార్యకు జన్మించిన ముగ్గురు పిల్లలతో ఆ హీరో విదేశాల్లో జాలీ ట్రిప్‌లో ఎంజాయ్ చేశారు. ఆ హీరో ఎవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 
 
సాధారణంగా తన సినిమా షూటింగ్‌లకు ఫ్యామిలీ మెంబర్స్‌ను తీసుకెళ్లడానికి ఇష్టపడని పవన్ ఈసారి మాత్రం తన ముగ్గురు పిల్లలను వెంట తీసుకొని బల్గేరియా వెళ్లాడు. రేణుదేశాయ్ పిల్లలు అకీరా నందన్, ఆద్యాలతో పాటు అన్నాలెజినోవా కుమార్కె పోలెనాలను తనతో పాటు బల్గేరియా తీసుకెళ్లాడు. బల్గేరియా నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన సమయంలో ఎయిర్ పోర్ట్‌లో మీడియా కెమెరా కంటికి చిక్కాడు. పవన్‌తో అకీరా, ఆద్యా ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలలో పవన్‌తో పాటు ఆయన భార్య అన్నా లెజినోవా కూడా ఉన్నారు.
 
కాగా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఇప్పటికే మేజర్ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకుంది. పాటల చిత్రీకరణ కోసం బల్గేరియాకు వెళ్లగా, అక్కడికి తన ముగ్గురు పిల్లలను వెంటతీసుకుని వెళ్లారు. వరుసగా సినిమాలకు కమిట్ అవుతుండటంతో పాటు త్వరలో రాజకీయాల్లోనూ బిజీ అవుతాడని భావిస్తున్న పవర్ స్టార్, పిల్లలతో ఎక్కువ సమయం గడిపేందుకే వెంట తీసుకెళ్లాడని భావిస్తున్నారు.