సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2017 (11:06 IST)

దేశం గర్వించదగ్గ సినిమాలు తీసిన దర్శకుడు కె.విశ్వనాథ్ గారు: పవన్ కళ్యాణ్

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్న ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లోని కె.విశ్వనాథ్ ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛంతో పవ

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్న ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లోని కె.విశ్వనాథ్ ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛంతో పవన్ శుభాకాంక్షలు తెలిపి, శాలువతో సత్కరించారు. 
 
అనంతరం పవన్ మాట్లాడుతూ విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం ప్రతి తెలుగువాడికి గర్వకారణమన్నారు. కె.విశ్వనాథ్‌గారు దేశం గర్వించదగ్గ సినిమాలు తీశారని అన్నారు. విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం ఆనందం కలిగించిందని అన్నారు. 
 
శంకరాభరణం సినిమాను చిన్నప్పుడు చాలా సార్లు చూశానని ఆయన తెలిపారు. విశ్వనాథ్ సినిమాల్లో శుభలేఖ, శంకరాభరణం, స్వాతిముత్యం సినిమాలు తనకు చాలా ఇష్టమన్నారు.