చరణ్, వదిన సురేఖ గారికి ఆ ఛాన్స్ రావడం హ్యాపీ.. అందరికీ నా మనః పూర్వక శుభాకాంక్షలు: పవన్
''చరణ్, మా వదిన సురేఖ గారి నిర్మాణంలో వస్తున్న తొలి చిత్రమే చిరంజీవి గారి 150వ చిత్రం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఖైదీ నెంబర్ 150 ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ చిత్రంలోని నటీనటులకు సాంకే
''చరణ్, మా వదిన సురేఖ గారి నిర్మాణంలో వస్తున్న తొలి చిత్రమే చిరంజీవి గారి 150వ చిత్రం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఖైదీ నెంబర్ 150 ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ చిత్రంలోని నటీనటులకు సాంకేతిక నిపుణులకు నా మనః పూర్వక శుభాకాంక్షలు.'' అంటూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అట్టహాసంగా శనివారం జరుగనున్న నేపథ్యంలో ఈ ఫంక్షన్‌కు పవన్ డుమ్మా కొట్టారు. ఇందుకు కారణం.. ఆ ఫంక్షన్‌కు తాను హాజరైతే.. మెగా ఫ్యాన్సీ దృష్టి మళ్లుతుందని.. మెగా ఫ్యాన్స్ ఫోకస్ అంతా.. అన్నయ్యపైనే ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ ఫంక్షన్‌కు పవన్ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా పవన్ ఖైదీ సినిమాకు.. తన కుటుంబ సభ్యులకు, నటీనటులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదిలా ఉంటే.. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితులను 48 గంటల్లోపు ఆదుకోవాలని.. వారి బాగోగులపై ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ డెడ్ లైన్ పెట్టారు. దీనిపై కిడ్నీ బాధితులకోసం చర్యలు తీసుకుంటాని సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. చంద్రబాబు చేసిన ప్రకటనను జనసేన స్వాగతిస్తోందని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. సమస్యను శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు కంటే ముఖ్యమంత్రి బాగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు.
ఉద్దానం బాధితుల తరుపన నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారున్. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా డాక్టర్లు, సామాజికకార్యకర్తలు తుది వరకు పోరాటం చేయాలని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు. ఉద్దానం అంశానికి ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు సాయపడ్డ మీడియాకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు.